రవీంద్ర భారతిలో ఆదివారంఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సినీటీవి గేయ రచయిత డాక్టర్ మౌనశ్రీ మల్లిక్ అధ్యక్షతన జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనతి కాలంలోనే సాహిత్య సేవలో విశిష్టమైన కార్యక్రమాలను నిర్వహించినందుకు నిర్వాహకులకు అభివందనలు తెలిపారు. ముఖ్య అతిధి మరియు సంచాలకులు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని, అద్భుతమైన కవితలు వినిపించినందుకు సాహితీ ప్రియులకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కని మూడు పుస్తకాలు సమావేశంలో అవిష్కరించినందుకు సంతోషం వ్యక్తపరిచారు. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు కవి మరియు విశ్రాంత బ్యాంకు అధికారి శ్రీ రాజేంద్రప్రసాద్ రచించిన అక్షర సౌరభాలు పుస్తకాన్ని, శ్రీమతి పొన్నాల ధనమ్మ వ్రాసిన గాయాలు నేర్పిన కావ్యాలు పుస్తకాన్ని విశ్రాంత అటవీ శాఖ అధికారి అంబటి లింగ క్రిష్ణారెద్ది గారు, బాల బంధు. కవి శ్రీ గద్వాల సోమన్న వ్రాసిన 94వ పుస్తకం తంగేడు పూలు పుస్తకాన్ని సభాధ్యక్షులు డాక్టర్ మౌనశ్రీ మల్లిక్ గారు ఆవిష్కరించారు. ఈమధ్యనే ఐ. ఎ. ఎస్ గౌరవ హోదా పొందిన డాక్టర్ నరసింహారెడ్డి గారిని, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులు గారిని, సాహితీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న వదాన్యుడు అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అతిధులు ఘంటా మనోహరరెడ్డి గారు, గజవెల్లి సత్యనారాయణ స్వామి గారు, వీర శైవ సమాజ అధ్హ్యక్షులు డాక్టర్ బదరీనాధ్ గారు , అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారు, డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులు గారు చక్కని ప్రసంగాలు చేసి సభికులను ఆకట్టుకున్నారు.
కవిసమ్మేళన సామ్రాట్ మరియు కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధాకుసుమ 60 మంది కవులతో చక్కగా కవిసమ్మేళనం నిర్వహించి అందరి మన్ననలను పొందారు. సభను మొదట డాక్టర్ దీపక్ న్యాతి గారు అతిధులను పరిచయం చేసి, అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు. కవులకు, అతిధులకు మెమెంటోలతోను, శాలువాలు కప్పి పుస్తకాలు అందించి పూజ్యనీయులు శ్రీ దైవఙ్ఞ శర్మ గారు సత్కరించారు. ధరణీ మహిళా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి ధనమ్మగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, ముఖ్య సమన్వయ కర్త, కాప్రా మల్కాజగిరి కవుల వేదిక.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి