ఒంటరినీ..: - డా ప్రతాప్ కౌటిళ్యా.
నాతో నడవడం ఇష్టం లేక 
చెట్టు అక్కడే నిలబడిపోయింది. 
అది వనమయింది మహా రణ్యమైంది.
నేను ఒంటరినయ్యాను.

నాతో నడవడం ఇష్టం లేక 
పర్వతం అక్కడే నిలబడిపోయింది. 
అది హిమాలయమైంది మహా పర్వతమైందీ.
నేను ఒంటరినయ్యాను.

నాతో నడవడం ఇష్టం లేక 
నక్షత్రాలన్నీ అక్కడే ఆగిపోయాయి. 
అది అందనంత ఆకాశమైంది 
నేను ఒంటరినయ్యాను

ఏడ్చి ఏడ్చి నేను మహాసముద్రానయ్యాను.
ఏడ్చి ఏడ్చి నేను ఒంటరి ఎడారినయ్యాను
అయితే నేమి 
సూర్యుడు -చంద్రుడు -నాతో ఉన్నాడు 
నది నాతో ఉంది. నాతోపాటు పారుతుంది. 

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు