వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143
 ఈ సమాజంలో తిరుగుతున్న ప్రతి వ్యక్తి ఎదుట వారితో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో  తెలుసుకొని ఉండడం ముఖ్యం  ఏ వ్యక్తికైనా గౌరవ మర్యాదలు కావాలి అని అనుకుంటే  అవి     వాటంతట అవే ఆకాశం నుంచి   ఊడి పడవు  నీకున్న పేరుతో కానీ డబ్బు తో కానీ పరపతి తో కానీ  నీ తల్లిదండ్రుల మంచితనం తో కానీ నీకు గౌరవం రావటం అనేది అసంభవం  ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా  ఉంటుంది  కానీ మనుషుల ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి ఈ ప్రపంచం మరీ కొత్తగా కనపడుతూ ఉంటుంది నీవు ఎదుటివారిని మర్యాదగా చూస్తే వారు మర్యాదగా చూస్తారు  పెద్దలను గౌరవిస్తూ ఉంటే వారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు  మన ప్రవర్తన ముఖ్యం  నీవు ప్రవర్తించే తీరు నీకు తెలుస్తుంది కనుక ఎలాంటి మార్గంలో పయనించాలో నీవే నిర్ణయించుకోవాలి.
ఇవాళ క్యాన్సర్ వచ్చిందని ఎవరైనా అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అతని జీవితం పై ఆశ  వదులుకుంటారు  దీనికి మందు లేదు అని తీర్మానించుకుంటారు  కానీ బార్లీ గింజలను  నిత్యం వాడుతున్నట్లయితే ఆ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ బార్లీ గింజలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో ఉన్న కొవ్వు కరిగిస్తుంది  దానితో మిగిలిన వ్యాధులు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు లేకుండా చేస్తుంది గుండెకు సంబంధించిన వ్యాధులను కూడా నివారిస్తుంది జలుబు గాని మిగిలిన సమస్యలు ఉన్నట్లయితే వాటిని తక్షణం తగ్గిస్తుంది పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది  ఎముకలను దృఢంగా మారుస్తుంది  ఇన్ని లక్షణాలు ఉన్న బార్లీ గింజలు  అతి తక్కువ ఖర్చుతో మన ముందుకు వస్తాయి  కనుక వాటిని వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోమని  వైద్యుల సలహా  వాటిని పాటిస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగవలసిన   అగత్యం లేకుండా పోతుంది  మరి పాటిస్తారు కదూ.
స్త్రీ ధర్మాలను గురించి అనేకమంది అనేక విధాలుగా తెలియజేశారు  ఈ విషయాలన్నీ వేదాలలో ఉన్నాయి ఉపనిషత్తుల్లోనూ ఉన్నాయి  అనేకమంది అనేక సందర్భాలలో ఉదహరిస్తూ చెప్పిన  మాటలు ఉన్నాయి  నిజానికి స్త్రీ పురుషుల కన్నా మంచి అణకువ క్షమా ఎక్కువగా ఉంటాయి  చిన్నతనంలో ఆమె తండ్రి చెప్పిన మాటలను విని దానిని  ఆచరణలో పెట్టడానికి  జీవితకాలం  శాశ్వతంగా ఉండేలా చేస్తుంది  సుమంగళి అంటే తాళిబొట్టు ఉన్న అమ్మాయి  తప్పకుండా నుదుటన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు  ఆ కుంకుమలో పసుపు కూడా ఉంటుంది కనుక  రోగకారక క్రిములను  మటు మాయం చేస్తుంది  శాస్త్రీయ జ్ఞానం కూడా కలిసి వస్తుంది కనుక ఈ విధానాన్ని పెద్దలు పెట్టారు.


కామెంట్‌లు