వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143.
 ఆ మేధావి పేరు రావూరి భరద్వాజ గారు  ఆయన రాసిన నవల పాకుడు రాళ్లు  నీటిలో ఆ రాతిని ఆధారం చేసుకుని పైకి పాకడానికి ప్రయత్నం చేసిన ఏ వ్యక్తి కూడా పైకి రాలేదు  ఆ పాకుడు ఆ వ్యక్తిని కిందకు తోస్తూనే ఉంటుంది  అన్న అద్భుతమైన   అర్థంలో ఆ నవలలు మనకు అందించారు భరద్వాజ గారు.డాక్టర్ దాశరథి  రాసిన అనేక ఖండ్లకావ్యాలలో  ప్రత్యేకించి ఎక్కువగా  తన తెలంగాణ ప్రాంతం  గురించి రాసినవి  వారి సినీ రంగ ప్రవేశం చేసిన తరువాత  వారు ఏదైనా కొత్త సినిమాకు పాట రాయవలసి వస్తే  దానికి సంబంధించిన  ప్రతి ఎవరి వద్ద ఉన్నదో వారిని స్నేహం చేసుకొని  అంతకుముందు కవులు రాసి ఇచ్చిన  పాటలను వినడం ఆయనకు సరదా  సరదాగా విన్న ఆ పాటలను మనసులో ఉంచుకొని  దానికన్నా మెరుగైన అందమైన  ప్రేక్షకులు నాలుగు కాలాల పాటు జ్ఞాపకం ఉంచుకునే విధంగా  పదాలను అల్లి  దానిని బుల్లి మెదడులలో కూడా  నిక్షిప్తం చేయగలిగిన మేధావి  వారు రాసిన ప్రతి కావ్యం  వారికి ఆంధ్రదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినవే పుట్టుకతోనే ప్రతి జీవి జ్ఞానంతో ఈ భూమి మీదకు వస్తాడు  ఒక సైడ్ బిడ్డను గమనించండి  పాకుతూ పాకుతూ వెళ్లే పాప  ప్రమిద గాని  కొవ్వొత్తిగానీ చూసి ఆగిపోతుంది  ఆ వెలుగులు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది  తీరా ఆ వెలుగు దగ్గరకు చేతిని పెట్టేసరికి ఆ వేడిని తట్టుకోలేక వెంటనే చేతిని వెనకకు తీసుకుంటుంది  అది ఎవరు నేర్పారు వాళ్ళ అమ్మ  స్వతహాసిద్ధంగా వచ్చేటటువంటిదే జ్ఞానం  వయసు పెరుగుతున్న   కొలది తనకు ఎదురైన అనేక సంఘటనల వల్ల  తన చుట్టూ ఉన్న స్నేహబంధం వల్ల  మంచి చెడు ల భేదం గమనించడానికి ఆస్కారం ఉంటుంది  మంచిపని తాను తలిస్తే దానిని స్వీకరించడం లేదు అని అనుకుంటే త్రుణీకరించడం  జరుగుతూ ఉంటుంది  విద్యార్థి దశలో తాను చదువుతున్న ప్రతి పుస్తకం లోను తనకు నచ్చిన ఒక అంశం తప్పకుండా ఉండి ఉంటుంది  దానిని స్వీకరించి జీవితంలో అనుసంధానం చేస్తాడు తనకు తెలియకుండానే.

కామెంట్‌లు