వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143
 ఎవరికైనా తలలో దురద రావడం  సహజం  దానికోసం ఒక చేతితోనే  తలను రుద్దాలి తప్ప రెండు చేతులతో చేయకూడదు  తిరిగి ప్రత్యేకంగా ఉండవలసిన లక్షణం  గృహిణి కంట నీరు  ఒక్క చుక్క  నేల రాలితే  ఆ ఇంటికి ఒక సంవత్సరం దరిద్రం  వస్తుంది అని పెద్దలు చెబుతారు  ఏ పరిస్థితుల్లోనూ స్త్రీ కంటనీరు పెట్టే పరిస్థితి తీసుకురావద్దని పురుషులకు ఇది హెచ్చరిక కూడా  ఆమె సుఖంగా ఆనందంగా ఉంటేనే ఆ సంసారం మొత్తం  గౌరవప్రదంగా నలుగురిలో నిలబడుతుంది  లేకుంటే హాస్యo పాలవుతుంది  తమ ఇంటికి ఎవరైనా సుమంగళి స్త్రీ వచ్చినట్లయితే  వారితో మాట్లాడిన తర్వాత  తిరిగి వారు వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ తాంబూలాధులు ఇచ్చి  సత్కరించాలి  నిండు నూరేళ్లు  సుమంగగళి గా జీవించమని చెప్పడం దాని ఉద్దేశం  దానికి ప్రత్యామ్నాయంగా ఆవిడ వెళుతూ వెళుతూ ఈవిడను కూడా నూరేళ్లు సుఖంగా ఉండాలని దీవించి వెళుతుంది.
గర్భిణీ స్త్రీలు టెంకాయను కానీ గుమ్మడికాయని కానీ పగలకొట్టకూడదు  టెంకాయ కొట్టే స్థలంలో కూడా ఉండడానికి వీలు లేదు  అలా జరిగినట్లయితే  గర్భవిచ్చితి  జరుగుతుందని పెద్దలు అంటారు  యజమానురాలు సూర్యోదయానికి ముందే ఇంటిముందు కల్లాపి తల్లి ముగ్గు వేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది  చేతితో ఎప్పుడూ అన్నo ఉప్పు, పసుపు వడ్డించకూడదు ఏ వస్తువైనా ఇంట్లో లేకపోతే నిండుకుంది అనాలి తప్ప  లేవు అని అనకూడదు అలా అనడం వల్ల తధాస్తు దేవతలు కూడా నాస్తి నాస్తి అంటారు  ఆ  లేమి శాశ్వతం అవుతుంది  కనక పెద్దలు చెప్పిన ఈ సూక్తులను మనసారా ఆచరించి ఆనందాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ   కోరుకుందాం.శరీరంలో ఉండే అన్ని బాగాలను నడిపిస్తున్నది వెన్నుపూస  ఆ వెన్నుపూసలో ఆరు సూక్ష్మస్థానాలు ఉన్నాయి అని  శ్రీవిద్యలోనూ వివిధ మంత్రాలు లోనూ చెప్పిన ప్రకారం  మొదటి మూలాధారం సహస్రారాన్ని సత్య లోకం నుంచి  ప్రమాదవ స్థానం అని చెప్తారు  ఆజ్ఞా చక్రం తపోలోకం జీవాత్మ స్థానం జనలోకం ఆకాశ భూతస్థానం  అనాహత మహర్లోక  వాయు భూతస్థానం  మణిపూరకం సుర లోకం   అగ్ని   భూతస్థానం  స్వాచిష్టానం భవలోకం జల భూతస్థానం  ఆధారము భూలోకం పృధ్వీభూతస్థానం  మూలాచార చక్రం మల రంద్రానికి సుమారు 200 పై భాగంలో ఉంటుంది దీని రంగు ఎర్రగా రక్త వర్ణం గా ఉంటుంది  నాలుగు రేకులు గల తామర పువ్వు ఆకారంలో ఉంటుంది దీనికి అధిపతి గణపతి వాహనం  ఏనుగు.


కామెంట్‌లు