వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143
 ఉసిరి  దీనినే అమృత ఫలం లాగా చెప్తాడు  కారణం శరీరానికి చలవ చేస్తుంది  దీనిలో రెండు రకాలు    ఒకటి తీపిగా ఉండేది మరొకటి వగరుగా ఉండేది  ఈ రెండవ రకం పచ్చడి పట్టడానికి అనుకూలం భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద  ఉసిరి పచ్చడి తో తినమంటారు పెద్దలు దీనివల్ల వీర్యవృద్ధి కేశవృద్ధి కలుగుతుంది  ఉసిరికాయ తిన్న వెంటనే మనం నీళ్లు తాగినట్లయితే ఎంతో తియ్యగా ఉంటుంది దాంతో మరికొంచెం నీళ్లు తాగుతాం  అది తాగడం వల్ల  దాని శక్తి లోపలికి వెళ్లి రక్తనాళాలను శుభ్రపరచడంలోనూ  కఫాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది  ఇది  కాయలుగా పచ్చడి పడతారు  పచ్చడిగా  కూడా చేస్తారు  ఈ రెండు ఎంతో రుచిగా ఉంటాయి  పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు  కనుక రోజు ఉసిరికాయ తినడం అలవాటు చేసుకోండి.
ఏ వ్యక్తికైనా జీవితంలో మనకు స్వాతంత్రం లేదు అని తనివితీరా ఏడవడానికి నవ్వడానికి కూడా  భయపడవలసి వస్తుంది  స్నేహ బృందంతో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా హాశ్యోక్తులు చెబితే  పగలబడి నవ్వినందుకు వీడు పిచ్చివాడు అనే ముద్ర వేస్తారు  అదే కుటుంబంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు కానీ  జీవితంలో  ఏదైనా ఆపద పొందినప్పుడు కానీ తనివి తీరా  ఏడవడానికి కుదరదు  అది చూసినవాళ్లు పిచ్చివాడు అంటారు  పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరు  చేయవలసిన పని  అలా మర్యాదగా ప్రవర్తించే వారిని అయ్యో పాపం అమాయకుడు అంటూ   జాలిపడతాడు  మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు  వారి తప్పులను సరి చేస్తూ చెప్పిన  జ్ఞానిని గర్విష్టి అంటారు  మన ముందు వీడేదో గొప్పలు పోతున్నాడు అని చెడ్డగా చెప్పుకుంటారు.ఏదైనా తెలిసిన విషయం ఉండి  దానిని చెపితే వారు ఎలా అనుకుంటారు అన్న భయంతో  తెలియనట్టుగా కూర్చున్నవాడిని  వీడు తెలివితేటలు లేని పెద్దమ్మ  అని ఈసగించుకుంటారు  అలా అని తెలిసిన వాడితో తెలియని వాడితో కలుపుగోలుగా మాట్లాడి  వారి అభినందనలను పొందే వారిని  వీడు ఒట్టి పొగరబోతు రా  దేశంలో ఉన్న విషయాలన్నీ కలిపి చెబుతూ ఉంటాడు వీడు  అని ఎద్దేవా చేస్తారు  ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు నలుగురిలో ఉంటే తిరుగుబోతు అంటారు  మౌనoవహిస్తే చేతగానివాడు అంటారు కాదని వాదిస్తే వీడు అతివాది అంటారు ఏదేమైతే నాకేం లే అని ఊరుకుంటే వీడు స్వార్థపరుడు   అంటారు  ఎలా బ్రతకాలో ఎదురయ్యే లోపు చితికి పోతుందేమో ఈ బ్రతుకు  లోకమంతా మెచ్చేట్టుగా బతకడం అంటే  మనం చచ్చినట్టు బ్రతకటమే ఇది నిజం  లౌక్యంగా ఉన్నవాడు మాత్రమే  ఈ సమాజంలో పెద్దమనిషిగా చలామణి అవుతాడు.


కామెంట్‌లు