వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143.
 మానవ జీవితంలో  మంచివాడు చెడ్డవారు అని రెండు రకాలు  వీరిలో ఎవరైనా తప్పు చేయడం మానవ సహజం  తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే  అలాంటి తప్పు ఎప్పుడైనా ఒక వ్యక్తి చేసి ఉంటే  ఈ తప్పు నేను చేశాను అని ఒప్పుకొని  మళ్లీ జీవితంలో ఆ తప్పును  చేయకుండా ఉండేవాడు  బుద్ధిమంతుడు సమాజంలో సంస్కారoగా జీవితాన్ని కొనసాగించాలి అంటే  మీ నడత నడక కూడా  సరి చేసుకోవాలి  నీ వయసు కన్నా పెద్ద వారిని చూసినప్పుడు నమస్కరించడం  చిన్నవారిని  ప్రోత్సహించడం  బాధ్యత  గా స్వీకరించాలి  సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది తల్లిదండ్రుల దంపతులనుంచే తప్ప ఏ కిరాణా షాపులో దొరకని వస్తువు  వినయ సంపన్నుడువై సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నీకు ఇచ్చే గౌరవ మర్యాదలు నీ ఊహకు   అందవు.తన కవిత ద్వారా సంస్కృత భాషకి గౌరవం తెచ్చిన మహా కవి  కాళిదాసు గారు  ఆయన ఒక సందర్భంలో పరదేశానికి బయలుదేరి న సందర్భంలో జరిగిన ఒక సంఘటన  మధ్యలో వారికి బాగా దాహం వేస్తుంది  కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుడిసె కనిపిస్తే  ఆ ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక బాలికను అమ్మా నాకు దాహంగా ఉంది నీళ్లు ఇవ్వమని అడిగాడు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు కదా నేను ఎలా ఇస్తాను అని   బదులిచ్చింది దానికి కాళిదాసు నేను ఎవరో తెలియక చెప్పండి అన్నాడు  అహంకారపూరితమైన మాటలు విని బాలికన్నది మీరు అబద్ధం ఆడుతున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వారు ఎవరో చెబితే మీకు నీళ్లు ఇస్తాను అంటుంది  కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతుంది  ముందు నాకు నీళ్లు ఇవ్వమని బ్రతిమలాడుకుంటాడు అయినా బాలిక కనికరించదు  ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహం అని సమాధానం చెబుతుంది.ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు అని అడుగుతుంది నేను బాటసారి ని అని అన్నాడు మళ్ళీ అసత్యం ఆడుతున్నారు బాటసారి అంటే ఒక చోట నుంచి మరోచోటికి తెలియకుండా వెళ్ళాలి. మీరేమో అలసిపోయారు కదా ఈ లోకంలో అలా అలిసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు వారు సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్లిపోయింది బాలిక  దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందు నిలబడి మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ఎప్పుడైతే పలికాడో కాళిదాసు లోపల నుంచి ఒక ముసలామె బయటికి వచ్చి మీరు ఎవరో సెలవివ్వండి నీళ్లు ఇస్తానంది దానికి దీనంగా నేను అతిధి ని అని బదులు ఇచ్చాడు ఇద్దరు అతిథులు ఒకటి ధనము  రెండవది యవ్వనం  ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో మనకు తెలియదు అంటుంది ఆ ముదుసలి.

సమన్వయం ; డాక్టర్ . నీలం స్వాతి
 
కామెంట్‌లు