వైవిధ్యంసాయి వేమన్ దొంతి రెడ్డికుంచనపల్లి,9182244143.
 కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతూ ఉండడం  ఒకరిపై ఒకరు గట్టిగా కేకలు వేసుకోవటం  దీనివల్ల  పెళ్లి వయసుకు వచ్చిన పిల్లలు  పెళ్లి చేసుకుంటే రేపు మనకు కూడా ఇలాగే జరుగుతుంది  ఏమో అన్న కారణంతో అసలు నాకు పెళ్లి వద్దు అని భీష్మించుకొని కూర్చొవడం  ఒక మనిషి అంటే మరొక మనిషికి గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం  పెద్దవాడే తగిన వాడా నా బుద్ధి పనికి రాదా కుటుంబాన్ని నేను  సక్రమంగా నడపలేనా ఆర్థికంగా  ఎలా ఖర్చు చేయాలో నాకు తెలియదా అన్న విషయాల గురించి  పట్టుదలకు పోయి  బంధాలను తెంచుకోవడం  మధ్యవర్తి గా నడిపే వ్యక్తులు లేకపోవడం  ఎవరి ఇష్టానికి వాళ్లు వారసుడు కావడం  ఎవరైనా ఎప్పుడైనా పెద్దలు మంచి చెప్పినా అది వీరి బుర్రకు ఎక్కదు  వారు ఎందుకు అలా చెప్తున్నారో వీరికి అర్థం కాదు.ఇంట్లో ఏం జరుగుతుంది పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు  దానికి తగినట్లుగా తాను వారికి చేయవలసిన సహాయం ఏమిటి  అన్న విషయాలు ఆలోచించే పాపాన పోరు  అతి చిన్న విషయాలకు కూడా అలగటం  రక్తసంబంధీకులతో కూడా దూరంగా ఉండడం  మౌనం వహించడం  చేయడం వల్ల బంధాలు దూరమవుతూ ఉంటాయి  ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల  కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం అతి చిన్న విషయాలకే  బంధాలను వదిలిపోవడం  ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహాలు తీసుకోకుండా  తన చేతినిండా డబ్బులు ఉండి  అనవసరమైన వాటికి ఖర్చు చేస్తూ  కుటుంబానికి సంబంధించిన ఏ అవసరాన్ని తీర్చకపోవడం  వల్ల  పెద్దలతో అభిప్రాయాబేదాలు రావడం  దానితో మాటా   మాటా పెరిగి ఆ కుటుంబమే విడిపోయే స్థితికి రావడం.దీనికి కారణాలను విశ్లేషించుకుంటూ వెళితే మొదట చెప్పవలసింది  కుటుంబంలో ఉన్న చిన్నపిల్లల అతి తెలివి గర్వం డబ్బులు ఉన్నాయన్న అహంకారం  వీరు చిన్న తప్పులు కూడా భరించలేనంత అసహనం ఓర్పు లేకపోవడం  పెద్దలతో కూర్చుని మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వారికి కావలసినవి ప్రస్తుతం జరుగుతున్నవి  అన్నిటిని విశ్లేషించుకొని  తమకు ఏది కావాలో దానిని నిర్ణయించుకోలేకపోవడం  మీరు ఈరోజు  ఏ కుటుంబంలో చూసిన గృహిణి టీవీ  ధారావాహికలకు దాసోహమై అక్కడే కూర్చుంటుంది  పిల్లలు నెట్వర్క్ లో మునిగిపోవడం ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారు ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ  ఇంట్లో ఏం జరుగుతుందో వాడికి తెలియదు  తెలుసుకోవాలన్న ఆలోచన కూడా వారి బుద్దికి రాదు  వారికి ఫోన్లో  24 గంటలు ఏదో ఒకటి చూడడమే పని.


కామెంట్‌లు