ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నేను రేడియోలో పాల్గొనే ప్రతి కార్యక్రమం బోసుకు తెలుసు వాటి వల్ల అతనిలో రేడియో నాటకాల పై వ్యామోహం పెరిగింది. తను కూడా నాలా చాలా నాటకాల్లో గాత్రధారణ చేయాలని కోరిక కలిగింది  అప్పటినుంచి దాని అనుభవాల మీద కృషి చేశాడు ఆ తర్వాత నేను రేడియో నాటక కళాకారునిగా ఉద్యోగంలో చేరడం తాను చదువు ముగించడం తర్వాత గన్నవరంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది గన్నవరం వాతావరణం అతనికి బాగా వంట పట్టింది  కాకాని వెంకటరత్నం గారి దగ్గరనుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వరకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి తనకు విస్తృతంగా నాటకాలపై ఉన్న ప్రేమ అతన్ని నాటకాల కుర్రవానిగా ముద్ర వేసింది. నాటకాల మీద కుతూహలం కలవారిని చేరదీసి నాటక సమాజాన్ని ప్రారంభించాడు. ప్రాథమిక దశలోనే తాను నటించి నిర్వహించి దర్శకత్వం వహించిన అల్లూరి సీతారామరాజు నాటకం విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది ప్రతి గ్రామంలోనూ దీని ప్రదర్శన కావాలని అడిగిన వారు ఉన్నారు ఆ నాటకం చూస్తూ ఉంటే ఓ సంగీత కచేరిని అనుభవిస్తున్నట్టు ఓ కళాత్మక సినిమాను ఆస్వాదిస్తున్నట్లు అందమైన జానపద నృత్యాల మేళాలను ఆనందిస్తున్నట్లు ఉండేది పడాల రామారావు గారి రచనలు ఆధారం చేసుకుని అనేక విభజన సంఘటనలను ఏర్చి కూర్చి తాను నాటకాన్ని తయారు చేయడం ఓ వింత అనుభూతి  తాను పడ్డ శ్రమ దాని  వెనక తపన పాత్రల ఎన్నికల్లో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఖర్చుకు వెనకాడకుండా సాంకేతిక విలువలను జోడించి ఆ రోజుల్లోనే  స్పోర్ట్స్ లైటింగ్లను కూడా వాడి ఓ కళాఖండంగా తీర్చిదిద్దాడు.
ప్రఖ్యాత విమర్శకులు డాక్టర్ రాజు గారు  ఆ నాటకాన్ని చూసి ఎంతో ముక్తులైనారు  అద్భుతమైన కళాఖండాలను ఆస్వాదించే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదూరు మల్లి జనార్దన్ రెడ్డి వరకు అందరి ప్రశంసలను పొందాడు రంగస్థల విమర్శకులే గాక రేడియో విమర్శకులైన పొన్నాల సుబ్బారెడ్డి వరకు అందరి ప్రస్తుతలను పొందాడు  ఒక నాటక పరిషత్ యొక్క న్యాయ నిర్ణయ నిర్ణయాధికారిగా వచ్చిన బోస్  జ్ఞాపక శక్తిని పాత్రలను అర్థం చేసుకోవడంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఎంతగానో కొనియాడాడు బి ఎస్ భట్టు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామారావు గారి ప్రభుత్వంలోనూ ఇటు కాసు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ సాంస్కృతిక శాఖలో ప్రధాన బాధ్యత వహించి నాటకాలను ఏకపాత్రలను అనేకం నిర్వహించారు.


కామెంట్‌లు