ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ తర్వాత 1971 మార్చి 21వ తేదీన వివిధ భారతి గా మార్పు చేశారు  ఆ ప్రారంభ కార్యక్రమం నేను  అమలు చేయడం ఆనందాన్ని అనిపించింది అద్దంకిమన్నారు ఆయన అసలు పేరు అద్దంకి  ఎంబ్రిల్ మన్నార్  పిల్లలు బ్రతకడం లేదని ఆ పేరు పెట్టారు తల్లిదండ్రులు మన్నారు కు వివిధ భారతి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాలా చిన్నతనంగా ఉండేది నాది 20 కిలో వాట్లు నీది ఒక కిలో వాటే అని ఎప్పుడు చెప్పుతూ ఉండేవాడు  ఎంత దూరం వెళుతుంది ఈ కార్యక్రమం అని చెప్పేసి వాడు. అందువలన నేను లింగరాజు శర్మగారు మా సీనియర్ కుటుంబరావు గారు ఈ కార్యక్రమాలను చేసేవాళ్ళం  ఆ తర్వాత కోకా సంజీవరావు శ్రీనివాసమూర్తి  కామేశ్వరరావు బదిలీ మీద విజయవాడ వచ్చారు.దాన్లో మేమే డ్యూటీ ఆఫీసర్  అప్పట్లో ప్రసారమైన అయీ కార్యక్రమాలను కూడా రికార్డ్ చేసేవాళ్లం  మొదట సివిల్ రేడియో నెట్వర్క్ అనే పేరుతో ఉండాలని 1936 లో ఆల్ ఇండియా రేడియోగా 1957లో దానిని ఆకాశవాణిగా మార్చారు  అప్పట్లో ఆలిండియా రేడియో అంటే ప్రభుత్వ కార్యక్రమాల బాకాగా చెప్పుకుంటూ ఉండేవాళ్లు బ్రిడ్జ్ పత్రిక సంపాదకులు కరంజియ ఒక వ్యాసం రాశాడు  వ్రాయడానికి కారణం ఢిల్లీ రేడియో వార్తలలో ఆల్ ఇండియా రేడియో వార్తలు పొరపాటుగా ఆల్ ఇందిరా రేడియో అని చెప్పి క్షమాపణ చెప్పి ఆల్ ఇండియా రేడియో అని సవరించుకోవడం జరిగింది  దానిని ఒకటిస్తూ క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు ఆ వార్త చదివినాయనా   తప్పు చెప్పలేదు  నిజమే చెప్పాడు.
ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీకి సంబంధించిన అధిక రాజకీయ వార్తలను భారీగా ప్రసారం చేయడం వలన  ఆల్ ఇందిరా రేడియో  అనడమే సముచితం అని ఆయన వ్యాసంలో పేర్కొన్నారు ఆ రోజుల్లో ఆ విషయాన్ని ప్రముఖం గా చర్చించుకున్నారు మేధావులు  అప్పుడు పార్లమెంట్లో ఉండే  జార్జ్ ఫెర్నాండెస్  విపక్ష నేతగా ఉండేవారు  ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీని  ఉద్దేశించి  ఇలా ప్రసారం జరగడం మీకు విచారంగా లేదా  అనే ప్రశ్నించి మీరు  మీ ఉద్యోగులకు ఎంత జీతభత్యాలు ఇస్తున్నారు అని అడిగితే  150 రూపాయలు అని ఎంతో గర్వంగా చెప్పింది  150 రూపాయలు బొంబాయిలో మేము మా పాకీ వాళ్ళకి ఇస్తున్నాం  అనగానే ఆమె ఆలోచించి  తన సహచరుల   సలహాలు కోరింది.


కామెంట్‌లు