ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఎన్టిఆర్ అన్న మూడు అక్షరాలు ఆంధ్రుల మనసుపై నందమూరి తారక రామారావు  గారి చిత్రపటం  ముద్రించబడుతుంది  ఆంధ్రులనే కాక పక్క ఉన్న కన్నడ తమిళ మలయాళ నటులను కూడా ఆకర్షించుచూ వారితో నటించాలన్న ఆకాంక్షను రేకెత్తిస్తాయి  దక్షిణాది ప్రజలలో  ఎన్టీఆర్ సినిమా వచ్చింది అంటే తెగపడి చేసేవారు అనేకమంది ఒకే చిత్రాన్ని అనేక సార్లు చూసిన ప్రేక్షకులు ఉన్నారు  దీనంతటికీ కారణం  ఆయన విగ్రహం ఏ పాత్రకైనా సరిపడిన  శరీరం అది  దానికి తగినట్లు శరీర ఆకృతిని అందంగా తయారు చేసుకోవడానికి నిత్యం  వ్యాయామం చేయడం  అనవసరమైన వ్యసనాల జోలికి వెళ్లకపోవడం  క్రమశిక్షణ కు మారు పేరుగా జీవించడం  తాను జీవించడమే కాక  ఎదుటివారిని కూడా జీవించేలా ఏర్పాటు చేసే మహా మనీషి  వారిని గురించి ఎంత చెప్పినా తక్కువే.కథానాయకునిగా వందల చిత్రాలలో నటించిన వారు  ద్విపాత్రాభినయం త్రి పాత్ర స్వభావం తెలిసి ఒక పాత్రకు మరో పాత్రకు వైవిధ్యాన్నిచూపి తన నటనా చాతుర్యంతో ప్రేక్షకుల మనసులను దోచిన వాడు  వారు ఏ పాత్ర ధరించినా ఈ పాత్రకు వీరు తప్ప మరొకరు చేయలేరు అన్నట్టుగా ఉండేది  సాంఘిక నాటకాలు వేసినప్పుడు  ఆ పాత్రకు సరిపడిన భాష  జానపదాలు వేయవలసి వచ్చినప్పుడు ఆ భాషను  ప్రాంతీయ భాషలలో నెల్లూరు శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతాల లాంటి  నటనను చూపవలసి వస్తే  ఆయాసతో  ఎక్కడ పొరపాటు లేకుండా  అందరి మన్ననలను పొందినవాడు  ప్రేక్షకుల దర్శకుల  పొగడ్తలు పొందడం  సర్వసాధారణo కానీ  కేవీ రెడ్డి గారి లాంటి  విశ్లేషణాత్మక  పరిశీలనా దృష్టిలో చూసేవారికి కూడా వీరు అభిమాన పాత్రుడు కాగలిగారు  వారి సినిమాలలో  అద్భుతంగా రాణించారు.ఒకే సినిమాలో కథానాయకుడు  ప్రతి నాయకుడు  రెండు పాత్రలను పోషించి ఆ రెంటికి జీవాన్ని ఇచ్చినవాడు  ఇవాళ ప్రభుత్వం వారు కానీ కొన్ని సమాజాల వారు కానీ  కొన్ని బిరుదులు బహుమతులు  ఇస్తున్నారు  దీనివల్ల వారికి అపకీర్తి రావడం తప్ప కీర్తి రావడం లేదు  డబ్బు మూలుగుతోంది దానితో వీటిని కొనుక్కుంటున్నా రు అని  అంటున్నారు ప్రజలు  అది నిజమో అబద్దమో చెప్పిన వాడికి వినే వాడికి కూడా తెలియదు  నిజమైన బహుమతి ప్రేక్షకుల హృదయాలలో దాగి ఉంటుంది  మామూలు ప్రేక్షకులను  ఆకర్షించడంలో  ఎక్కువ కష్ట పడవలసిన అవసరం లేదు  కానీ ఆ పాత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకుని చూసే ప్రేక్షకులను అర్థం చేసుకోవడం  వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోవడం  అసిధారా వ్రతం లాంటిది ఏ కొంచెం గాడి తప్పినా  ప్రాణాలు పోతాయి.


కామెంట్‌లు