ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కొత్త నాటకం ఎవరు ఎక్కడ ప్రదర్శించినా అక్కడికి వెళ్లి చూడడం ఏ రచయిత కొత్తగా నాటకం రాసిన ఆ రచయిత దగ్గరికి వెళ్లి మాట్లాడి నచ్చితే ఆ నాటకం తెచ్చుకోవడం ప్రదర్శించుకోవడం అలవాటైపోయింది శ్రీరాములు గారికి దానికి తగ్గట్టు పొట్టి ప్రసాద్ ప్రత్యేక హాస్యనటుడు అనేక సినిమాలలో కూడా నటించాడు జత కలవడంతో పిచ్చి మరీ ముదిరింది విద్యాధరపురంలో డాక్టర్ గారు ఆకలి అనే నాటకం రాశి ప్రదర్శిస్తున్నారని మంచి స్పందన వచ్చిందని తెలిసి గాంధీనగర్ నుంచి విద్యాధరపురం వరకు పొట్టి ప్రసాద్తో నడిచి వెళ్లి డాక్టర్ గారిని కలిసి విషయాలన్నీ మాట్లాడిన తర్వాత డాక్టర్ గారు తామే ప్రదర్శిస్తామని వారికి ఇవ్వడానికి నిరాకరించడంతో అభినందనలు తెలియజేసి వచ్చారు.ఆకలి నాటకంలో ఓ అంశం తర్వాత ఆత్రేయగారు రచించిన  తప్పుఎవరిది అన్న నాటికలో కూడా చోటుచేసుకుంది మరో పర్యాయం బాపట్ల వెళ్లి డాక్టర్ కొర్రపాటి గంగాధర్ రావు గారిని కలిసి అప్పుడు వారు రాసిన పెళ్లిచూపులు నాటకం తెచ్చుకున్నారు గరికపాటి రాజారావు గారు నాటక వినీల ఆకాశంలో రెండు నక్షత్రాలు పుట్టాయి అనడం అప్పటికే గొప్ప నటుడుగా పేరుపొందిన నటరాజ్ కే వెంకటేశ్వరరావు గారు వచ్చి తనతో నటిస్తాననడం ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఉంటుందో చెప్పలేం  అక్కినేని నాగేశ్వరావు గారితో సుడిగుండాల సినిమాలో నటించేటప్పుడు ఆయన కృషి పట్టుదల అక్కినేని గారికి నచ్చాయి నాగేశ్వరావు గారికి ఒక సుగుణం ఉంది తనకు నచ్చిన విషయాన్ని చెప్పడు మనసులో దాచుకుంటారు ఆ తర్వాత కాలంలో నాగార్జున ను కథానాయకుడిగా పరిచయం చేయడం కోసం చాట్ల వారిని పిలిచి శిక్షణ ఇవ్వవలసిందిగా కోరారు.
చాట్ల వారు అంగీకరించిన తర్వాత ఓ పర్యాయం నాగేశ్వరరావు గారి ఇంట్లో శ్రీరాములు గారిని చూసి ఏమిటి మాస్టారు ఇటు వచ్చారు అని అడిగితే నాగార్జున కోసం అని చెప్పారు శిష్యుడు గురువు దగ్గరికి రావాలా గురువు శిష్యుడు దగ్గరకు రావాలా నేర్చుకోవాలని మనసు లో ఉంటే వాడే మీ దగ్గరకు వస్తాడు మీరు ఇంటికి వెళ్ళండి అన్న సంస్కారి  ఘంటసాల బలరామయ్యగారి దగ్గర నుంచి కేవీ రెడ్డి గారి వరకు అందరి దగ్గర నేర్చుకున్న సంస్కారి అప్పుడు ఈ విషయాన్ని సినీ రంగంలో ప్రముఖంగా చెప్పుకున్నారు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎంక్వయిరీ విభాగం ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి అనౌన్సర్ శ్రీరాములు గారే దీనికోసం డిపార్ట్మెంట్ వారే బొంబాయి పంపించి అక్కడ ఆకాశవాణిలో శిక్షణ కూడా ఇప్పించారు.
సమన్వయం - డా.నీలం స్వాతి

కామెంట్‌లు