ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మా అమ్మ సీతారత్నమ్మ సార్థక  నామథేయురాలు  మా నాన్న వేదాంత చర్చల కోసం అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు రెండు మూడు నెలల వరకు కూడా ఇంటికి రాడు వారి పేరు చెప్పి అనేకమంది మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లేవారు  మలయాళ స్వామి వారి దేవస్థానం వచ్చి నాలుగు నెలలు ఆయన చాతుర్మాస్యాం నిర్వహించారు ఒకరోజు నేను మా అన్నలు అమ్మతో కలిసి స్వామీజీకి హారతి ఇస్తున్నాం హారతి ఇస్తున్న నా చిన్ని చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుని బాబు ఎడమ చేతితో కాదు కుడి చేతితో హారతి ఇవ్వాలి అని కుడి చేతిని తీసి హారతి పళ్లెం పట్టించారు  తర్వాత నన్ను ఒడిలోకి తీసుకొని  వెన్ను తట్టి నన్ను ఆశీర్వదించారు  ఆ ఆశీర్వాద బలమే నన్ను ఇంతటి వాడిని చేసిందని ఈనాటికీ నేను నమ్ముతున్నాను. నా తర్వాత నాకు ఒక చెల్లి పుట్టి మూడున్నర సంవత్సరాలు నాతో హాయిగా ఆనందంగా గడిపి మమ్మల్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోయింది  దానితో అమ్మ మంచం పట్టింది మా గ్రామంలో ప్రతి సంవత్సరం లంబాడీ కుటుంబాలు వచ్చి మా పొలాల్లో కాపలా ఉంటారు వారిలో మా అమ్మకు నచ్చిన అమ్మాయిని తీసుకువచ్చి  అమ్మ వ్యక్తిగత పనులు చేయడానికి  ఏర్పాటు చేశారు  ఆమె మా కుటుంబంలో కలిసిపోయి మాతో కాలక్షేపం చేస్తూ మా నలుగురు అన్నయ్యలను అన్నయ్య అంటూ నన్ను బాబు అంటూ పిలుస్తూ ఉండేది  ఆమెకు యుక్త వయసు వచ్చేంతవరకు  పెంచి వారి కుటుంబంలోనే మంచివాడిని చూసి వివాహం చేసి పంపించాం ఆ తర్వాత పెనమాక నుంచి ఒకరిని తీసుకొచ్చి  ఆమెను కూడా సొంత కూతురు లా పెంచి మా గ్రామంలో ఉన్న మనసు గారికి ఇచ్చి వివాహం చేశాం.
అలా ఆడపిల్లలేని కొరతను తీర్చుకుంది అమ్మ  మా నాయనమ్మ అరుమల్ల రంగమ్మ పేరు చెప్తే తెలియని వారు ఉండరు ఇతరులకు సహాయ పడడం అంటే ఆవిడకు చాలా ఇష్టం ఆవిడ తాడేపల్లి దాటిన తర్వాత ఆశ్రమానికి వెళ్లే వారికి నీటికి ఇబ్బందిగా ఉందని పెద్ద భావి తవ్విచ్చింది. దానిపైన ఈనాటికీ శాశ్వతంగా ఉంది  ఆమె పేరు  ఆమె మాట చెపితే అది జరిగాలి పనిమనిషి ఎవరైనా సరే  ఆమె చెప్పిన దాన్ని తక్షణం అమలు చేసేవారు మా గ్రామంలో దక్షిణ భాగాన చివరిల్లు మాది మేము ఇంకొంచెం ముందుకు వెళితే కాలువ ఆ ప్రక్కనే మాలపల్లి  అది దాటగానే మా పొలాలు  పచ్చటి పొలాల్లో పనులు చేయడం చాలా ఆనందంగా ఉండేది ఆ రోజుల్లో కుప్పనూర్పి వస్తే మాకు ఎంతో పండగ కుప్పలు వేసేటప్పుడు పరిగి ఏరడం పనిచేయడానికి వచ్చిన పిల్లల్ని బయటకి పంపటం చాలా ఆనందంగా ఉండేది.


కామెంట్‌లు