ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కానీ నేను మీకు చెబుదాం అనుకున్నాను ఎందుకంటే నేను చదువుకుంటానంటే చదివించి  నాకు ఏది కావాలన్నా మీకు ఇష్టం లేకపోయినా అంగీకరించి నా అభివృద్ధికి ఎంతో సహాయపడ్డారు ఈనాడు నేను ఈ దారిపై నాడుస్తున్నందుకు మీరు మొదట్లో కొంచెం బాధ పడ్డా  మమకారాన్ని చంపుకోలేక మధనపడినా  తరువాత నా గురించి చాలా సంతోషపడతారు అమ్మతో కూడా చెప్పండి ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తాడు కానీ ప్రజల కోసం జీవించి ప్రజల కొరకు మరణించిన వ్యక్తి ధన్యుడు నా ఫోటోలు కాల్చుదామని అనుకున్నా కాల్చలేరు వాటిని జాగ్రత్తగా చించినా సరే అనవసరంగా నాకోసం తిరిగి  హైరానా పడవద్దు అంది స్నేహలత ఆ ఉత్తరం చదివిన కుటుంబ సభ్యులేకాక మా గ్రామం మొత్తం  శోకసముద్రంలో మునిగిపోయింది. మా నాన్నగారు ఆరుమళ్ల సుబ్బారెడ్డి గారు 1925 లొ ఉప్పెన వచ్చినప్పుడు  గ్రామ ప్రజలంతా భోజనాలకు ఇబ్బంది పడుతున్న సమయంలో అందరికీ భోజనాలను ఏర్పాటు చేశారు  ఆ విపత్తు నుంచి తప్పుకునేంతవరకు  అందరి ఆకలి తీర్చడం బాధ్యతగా భావించి అలా చేశారు  1932లో  వారు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన ఆస్తిపాస్తులు తన సంతానానికి రాసి ఇచ్చారు  వందేమాతరం రోజుల్లో స్వాతంత్ర్య సమరయోధునిగా దేశం కోసం  నిస్వార్ధంగా పోరాటం చేసిన వ్యక్తి సంఘసంస్కర్త కులమత రహితుడు వితంతు వివాహాలు చేసిన సంస్కర్త  ఆంధ్ర భాషలో పాండిత్యం కలవాడు  తామర పత్ర గ్రహీత  1934 లో వేమన ఆశ్రమం స్థాపించి కపట స్వాముల బండారాన్ని బయట పెట్టారు  1933 లో తేడా తేలప్రోలు లో గ్రంథాలయానికి వేమన యోగి పేరును సూచించి అందరి మన్ననల్ని పొందారు.గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి  ముందు కొంత చరిత్ర జరిగింది  1916 వ సంవత్సరంలో  గుడిపాటి విశ్వనాథ శర్మ పాటిబండ సీతారామయ్య జొన్నల సుబ్బారెడ్డి  వీరు ముగ్గురూ ఒకే వయస్కులు  ఒకే ఆశయంతో సెకండరీ ఎడ్యుకేషన్ పోస్ట్ చేసుకొని ఒకచోట చేరిన వారు ఆ రోజుల్లో తేలప్రోలు ఆమాత్రం చదువుకున్న వారు ఆ ముగ్గురే కాలక్షేపం కోసం వారికి ఒక కోరిక కలిగింది జోన్నల సుబ్బారెడ్డి గారికి కొత్తూరులో ఒక మేడ ఉండేది తేలప్రోలు లో డాబా ఇళ్లకు పై అంతస్తు కలిగిన డాబా అది ఒక్కటే  ఆ డాబాలో ఒక గదిలో విశ్వేశ్వర “కలం” అనే పేరుతో ఈ ముగ్గురు కలిసి స్థాపించారు ఇంటి ముందు ఖాళీ స్థలంలో బ్యాట్మెంటన్ ఇంట్లో చదరంగం లాంటి   ఆటలు ఆడడం వారి కాలక్షేపం  ఆ రోజుల్లో జరిగే వార్తలు యుద్ధ వార్తలు తెలుసుకోవడానికి ఆంధ్రపత్రిక పేపరు తెప్పించేవారు.

కామెంట్‌లు