నేను మనిషిని మానవత్వం ఉన్నవాణ్ణి;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
నేను మనిషిని మానవత్వం
ఉన్నవాణ్ణి
నేను సాటి మనుషులతో సఖ్యతో ఉండేవాడిని!

నేను ఆశగలవాణ్ణి
అత్యాశ లేనోణ్ణి

అసూయ ద్వేషాలు ఇసుమంతైనా లేనివాణ్ణి

పని ఫలితమే మహాభాగ్యంగా
భావించేవాణ్ణి 

పరులు సొమ్ము
పరనింద  మహాపాపమని
తలంచేవాడిని!

నేను బ్రతకడం నేర్వనోడని
సార్థక నామధేయం
పొందినవాణ్ణి!

ఒకరి మెప్పుకొరకు
నా వ్యక్తిత్వాన్ని
ఫణంగా పెట్టేవాడనుకాను!

ఉన్నంతలో సంతృప్తితో జీవించేవాడిని!

దగా మోసం చేసి
ధనంపోగేసే
దోపిడికోరునుకానునేను!

నేను అతి సామాన్యమైన 
జీవితాన్ని 
గడిపే సగటుమనిషిని!

కాలన్ననుసరించి జ్ఞానసముపార్జనతో
జీవించడం నేర్చినోణ్ణి!కామెంట్‌లు