సాహితీ సుమాలు ;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం9640748497
ఇచ్చిన పదాలు
1) భూతల స్వర్గం
2)మధురోహలు
3) గిలిగింతలు
4) ఎదురు చూపులు
5) కన్నీటి కెరటాలు
****"*"*"
ఏలికలు నిర్దయులై
 ప్రజాసంక్షేమం మరిచిన పచ్చిస్వార్థపరులై
గంటెడు భూమిలేనోళ్ళు
అధిక సంతానం బహుమానమై
ఉపాధి ఉద్యోగం మృగ్యమై
పనిచూపే ఆసామి కోసం
అడ్డ మీద కూలీల ఎదురుచూపులు

మా దినసరి కూలీ బ్రతుకుల్లో
ఆనందపు గిలిగింతలు ఎక్కడివి?! ఆకలి కేకలు తప్పా!?
తిండి లేక నిద్రలేమితో  
 పీక్కు పోయిన ముఖాలతో దైన్యం పొడచూపుతుంటే

కాళ్ళు రెక్కలే ఆస్తిపాస్తులుగా
చేతికి పనిపాటదొరికినరోజు
సంక్రాంతి పండగగా?!
అదే దొరకని నాడు 
పస్తులతో జాగారమే 

ఆశలు ఆకాంక్షలు
ఆత్మగౌరవం చంపుకొని
బ్రతుకుతున్న
మా సంసార సాగరంలో
అనునిత్యం అలుపెరుగని
కన్నీటి కెరటాలు
ఎప్పుడుఎగసిపాడుతూనే
ఉంటాయి.
ఈ (మా)బాధ తీరనిది. జీవచ్ఛవంలా బ్రతుకు గడపక
తప్పదుగా!?
రచన


కామెంట్‌లు