నీతో నువ్వే పోటిపడు
అది నీ బలాలు ,
బలహీనతలను
నీకు అవగతంచేస్తుంది.
నేను గెలవగలను!?
నేను మాత్రమే గెలవగలను!?
అనే ఆత్మవిశ్వాసాన్ని
పెంపొందించుకో
అది నిన్ను విజయం దిశగా
నడిపిస్తుంది .
నడిచే దారిలో ముల్లున్నాయని
నడక మానుకుంటామా?!
మరోదారి వెతుకుతాం
లేదా!
ఉన్నది ఒక్కటే?
దారైతే?
ప్రతిముల్లు తొలగిస్తూ
నడక సాగిస్తాం?!
విజయమంటే?
మరింత బాధ్యతేగాని
తలపొగరు కాదు
ఓటమంటే?!
జీవితం ముగిసినట్టుకాదు
గెలుపునకు
మరో అవకాశం
చిక్కినట్టు?!
ఆదర్శాలు వల్లేవేయువాడు
ఆచరించి చూపడు
అతనో ప్రవచనకారుడు
మాటలను అమ్ముకొని
పొట్ట పోసుకుంటున్నాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి