కాలమే జీవన సూత్రం;- అంకాల సోమయ్య దేవరుప్పులజనగామ9640748497
ధైర్యం లేనివారే
దరిద్రులు అవుతారు
సాహసమే సక్సెస్ కు పునాది

కీర్తి గోపురాలు ఎవడు
నీకోసం నిర్మించలేదు
కీర్తి శిఖరాలు అధిరోహించవలసింది
ముమ్మాటికీ నువ్వే

జీవన యానంలో
కష్టం సుఖాలు శ్లేషార్థాలు మాత్రమే

అందరూ కాలాన్ని తిట్టి పోసేవారు
కాలాన్ని వాడక 
కొందరు  కాలప్రవాహంలోకొట్టుకుపోతారు

ఇతరులపై నిందలు మోపడం మన నైజం
మనం ఆ స్థానంలో ఉండి
ఆలోచిస్తే ఆ తప్పుకు
ఒప్పులు కనుక్కుంటాము

సహనం అన్నింటమంచిది కాదు
అతిసహనం అనర్థదాయకం
కాలాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లడమే 
జీవన సూత్రంకామెంట్‌లు