సర్కారు బడి ; అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
పల్లవి
చెల్లి పోదాము రావే ------
మనము సర్కారు బడికి------2
తమ్మి పోదాము రారో-----
మనము  సర్కారు బడికి2

1చరణం
తెలుగు ఇంగ్లీషు మీడియం----
ఏదైన చదువొచ్చు
ఉచిత పుస్తకాలు  ,మధ్యాహ్నం భోజనం
ఉచితయూనిఫామ్ టై బెల్ట్
 లిస్తారు-----2
/చెల్లి/

2చరణం
అనుభవం ఉన్నట్టి
సార్లెందరో ఉన్నారు
అర్థం కాకుంటే మళ్ళి మళ్ళి చెబుతారు2
అడ్మీషన్ ఫీజులేదు నెలనెలా ఫీజు లేదు 
డొనేషన్లు అసలే లేవు2

/చెల్లి/

3చరణం
బీదసాద చదువుకొని లోకాన్నే ఏలోచ్చు2
కండక్టర్ కావచ్చు కలెక్టరు కావచ్చు2
ఎనక ముందు ఆలోచన ఎందుకు --
మనం పోదాం పద సర్కారు బడులకు2కామెంట్‌లు