మన తిరుపతి వెంకన్న-చిరసాని శైలూషి,నెల్లూరు.9666639489
 ఈ వెంకటాద్రి ఈశ్వరుని మేరు పుత్రుడు దేవతలు ఋషులు మొదలగువారు సాక్షాత్ శ్రీమన్నారాయణ ని పూజిస్తూ ఉంటారు మోక్షప్రదాయకుడై శ్రీ వెంకటేశ్వరుని చుట్టుకొని శ్రీ  మహాలక్ష్మియూ బూణీలా దేవులు ఉన్నారు అట్టి వెంకటేశ్వర ఆలయంలో ఉత్తరభాగాన విమాన ప్రదక్షణంలో ఉన్నదని భరద్వాజ చెప్పారు ఇందరి తీర్థాన్ని సర్ప  దోషం లేకుండా  బ్రహ్మ క్షత్రియ వైశ్య సూద్రులు నాలుగు జాతుల వారు తీసుకున్నారు  ఇందులోని తీర్చపానము బ్రహ్మచారి మహాపాతములను కూడా పోగొట్టే ముక్తిదాయకంగా ఉంటుంది నాలుగు ఆశ్రమల వారు ఇందలి తీర్థము సేవించి ముక్తిని పొందుతారు మొదలగు కర్మవ్యాధులను కూడా ఇది పోగొడుతుంది  ఈ విషయాలన్నీ స్కాంద పురాణంలో ఉన్నాయి కుమారధార తీర్థము  శ్రీ స్వామి పుష్కరణకి ఉత్తరభాగాన మూడు మైళ్ల దూరంలో పాపనాశనం అనే తీర్థంవుంది ఈ తీర్థానికి వాయువ్య మూలమున 3 మైళ్ల దూరంలో కుమార రాధ తీర్థం ఉంది కుంభరాశి అందు రవి ఉండగా మాఖనక్షత్రంతో కలిసిన భాగస్వద్ద పౌర్ణమి నాటి మధ్యానం ఈ తీర్థములో స్నానము చేసినంత గంగాది సర్వ తీర్థములలో స్నానముగావించినంత ఫలము ప్రాప్తించి అది 12 సంవత్సరాలు ఉంటుంది ఈ తీర్థం  ముందు ఎవరు దక్షణ యుక్తముగా అన్నదానము గాని  చందన తాంబూల ధానముగాని చేస్తారో వారి స్నానఫలము పొందెదరు ఈ దినమున ప్రతి వత్సరము శ్రీవారి ప్రసాదమైన తల్లి హాలు చెందనము తాంబూలం తీసుకొని పోబడి వినియోగమవుతుంది ఈ తీర్థం వద్ద ఒక  ఇనుప నిచ్చెన యాత్రికులకు అనుకూలముగా  సౌకర్యంగా ఉండడానికి ఏర్పాటు చేశారు. పూర్వం తుంగభద్రా నది తీరాన వేద శాస్త్ర పారంగతుడైన పద్మనాభ శర్మ అన్న బ్రాహ్మణుడు ఉన్నాడు  ఆయనకు కేశవ శర్మ అను పుత్రుడు ఉన్నాడు  ఆ పుత్రుడు తల్లిదండ్రులను భార్యను సుకర్మలను వదిలి జూదం ఆడుతూ సరాపానం చేస్తూ ఉండేవాడు వేశ్యాంగనుల ఇండ్లలో పూజిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు డబ్బు కోసం దొంగతనాలు చేస్తాడు చేత ఖడ్గం పూని బ్రహ్మ హత్య చేస్తూ  ఉంటాడు  ఒకే పుత్రుడు ఇలా దుష్కర్ముడు అయ్యాడు అని దుఃఖిస్తూ తండ్రి తుదకు భరద్వాజ రుషివద్దకు వెళ్లి నమస్కరించి  చెప్పుకొనగా  ఈ తీర్థము తీసుకున్న తర్వాత దోషాలన్నీ పోతాయి అని  చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు పుత్రుని తీసుకొని వచ్చి శ్రీ స్వామి పుష్కరిణి స్నానముగావించి శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేయించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు తీసుకొని వెళ్లి  విమాన ప్రదక్షణం చేయించి తీర్థము  పానము చేయించగా ఆ దుష్కర్మ విముక్తి కలిగింది.


కామెంట్‌లు