విలువైనవి "చిరునవ్వులు";- -గద్వాల సోమన్న,9966414580
వెలలేనివి చిరునవ్వులు
అందమైన విరిజాజులు
జీవితాన మధుమాసము
తెస్తుందోయ్! మన కోసము

కలుపుతుంది బంధాలను
తెలుపుతుంది  అందాలను
అర నవ్వులు బ్రతుకుల్లో
నడిపించును వెన్నెల్లో

నవ్వులు విరియని ముఖములు
లేవు అందు సోయగాలు
వాడిపోయిన తోటలు
కూలిపోయిన కోటలు

మనసారా! నవ్వితే
చేకూరును ఆరోగ్యము
ప్రతిరోజూ నవ్వితే
అదేనోయ్! మహద్భాగ్యము

అనుక్షణమూ నవ్వరా!
అరుదెంచును గెలుపురా!
పైసా ఖర్చు లేనిది
ఉపకారం చేయునది

పదిమందిని నవ్వించు 
శత్రుత్వమే క్షీణించు
ఆయురాగ్యాలతో ఇక
పదిలంగా జీవించు


కామెంట్‌లు