నవ్వుల పువ్వులు;- -గద్వాల సోమన్న,9966414580
అధరాలపై నవ్వులు
గుబాళించే పువ్వులు
చీకట్లను తరిమేసే
వెలుగులీనే దివ్వెలు

వికసిస్తే దరహాసము
మోములో మధుమాసము
వెలసిన ఇంద్ర చాపము
వెన్నెలమ్మ ప్రతిరూపము

ఆరోగ్యం పంచుతుంది
ఆయుస్సును పెంచుతుంది
మృత సంజీవని హాసము
పుడుతుంది మన కోసము

మువ్వలే లేకుంటే
చెవులకు సునాదమేది?
నవ్వులే లేకుంటే
ముఖాలకు అందమేది?

విలువైన సంపద నవ్వు
ముఖమున వికారం దవ్వు
ఖర్చు ఏమీ లేనిది
బంధాలను కలుపునది

నవ్వుకుంది మహా శక్తి
బంధాలను కలుపుతుంది
పెంచుకొనుము అనురక్తి
అందాలను రువ్వుతుంది


కామెంట్‌లు