విజ్ఞాన జ్యోతికలు పుస్తకాలు;- -గద్వాల సోమన్న,9966414580
మస్తకాలు వెలిగించే దీపము
అందమైన అక్షరాల రూపము
విజ్ఞానము పంచిపెట్టు పుస్తకము
అజ్ఞానము తరిమికొట్టు వికాసము

బాగుపడాలంటే బ్రతుకులు
చదవాలి చాలా పుస్తకాలు
హస్త భూషణము ఆనాడు
తారుమారు ఆయెను ఈనాడు

నిజమైన స్నేహితుడు పొత్తము
స్థిరపరచును చంచల చిత్తము
తెలియజేస్తుందోయ్!సమస్తము
ఇది అక్షరాల వాస్తవము

ఏకాగ్రత కలుగజేయును
అభద్రతాభావం తరుమును
భరోసా ఇచ్చు గురుదేవులు
పరికింపగా  పుస్తకాలు

పుస్తకాలను గనుక నమ్మితే
భవిష్యత్తు బంగారుమగును
ఇష్టపడి శ్రద్ధగా చదివితే
జీవితాలు భువిని బాగుపడును


కామెంట్‌లు