శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
846)వంశవర్ధనః -

వంశము వృద్ధిచేయుచున్న వాడు 
విస్తరణ చేయగల సమర్థుడు 
సమూహము నడిపించుచున్నవాడు 
వంశవర్థన నామమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
847)భారభృత్ -

భారము వహించుచున్నవాడు 
విశ్వ మనుగడ నిలుపువాడు 
బాధ్యతలు నిర్వహించగలవాడు 
సేవాభావము గలిగినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
848)కథితః -

వేదముల కీర్తిగలిగినవాడు 
ప్రవచనములు చెప్పుచున్నవాడు 
భాష్యకారునిగా యుండినవాడు 
యోగ వృత్తాoతము వివరించువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
849)యోగీ -

ఆత్మజ్ఞానిగా భాసిల్లుచున్న వాడు 
యోగములో ఓలలాడుచున్నవాడు 
ధ్యానమందు మునిగినట్టివాడు 
యోగకవచములో నుండినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
850)యోగీశః -

యోగముకు ప్రభువుగానున్నవాడు 
భక్తులకు ఔషధము వంటివాడు 
కూడికకు ముఖ్యమైనట్టి వాడు 
యోగాభ్యాసము చేయించువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు