సుప్రభాత కవిత ; - బృంద
అలవికాని చీకట్లైనా
తొలగిపోక తప్పదు
అదుపులేని అరాచకమైనా
అణిగిపోక తప్పదు..

ఎదురు చూసిన వెలుగేదో
ఎరుపు రంగులు నింపుతూ
తూరుపున కాంతికలశం
ఒలికించిన కాంతిధారలో.....

కొత్త కళలు కురిపిస్తూ
కొత్త కాంతులు చిమ్ముతూ
కొత్త ఆశలు చిగురింపచేస్తూ
కొంగొత్త జీవచైతన్యమిస్తూ....

చేజార్చుకున్న అమృతక్షణాలను
దాచుకొచ్చి దోసిలిలో నింపి 
విలువ చెప్పి నిలువ చేసికొమ్మని
కలలు కన్న కాంచనవేదికనిస్తూ

కలత పడక కదిలిపొమ్మని
కమ్మనైన దీవెనలతో
కళకళ మను జిలుగులతో
కనుల కాంతులు నింపే

వైభవమైన వేలుపుకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు