బడి గంట గణ - గణ...!!
*****
గణ - గణ మోగెనుబడిగంట
బిర - బిర చేరిరి పిల్లలంతా
వందే మాతర గీతం...
ఆలపించిరి వారంత...!!
మాతెలుగు తల్లికి మల్లె పూదండని చక్కగా పాడిరి., వారి, వారి తరగతి
గదులకు తరలి పోయిరి...!
క్షాసులో టీచరులు
పాఠములు చెప్పిరి
హోము వర్కులు కూడ
చెయ్యమని ఇచ్చిరి..!
డ్రిల్ మాస్టర్ వచ్చి
ఆట లాడించిరి
మధ్యాన్న భోజనం
గిడ్డు తో పెట్టిరి ...!
కొత్త క్షాసులు-
కొత్త స్నేహాలు
ఎన్నెన్నొ కబురులు
ఎంతొ ఆనందము..!
బడి గంట గణ - గణ
మోగింది...
పిల్లలు ఇల్లకు
పరుగు తీసారు....!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి