మల్లెల నవ్వులు;- కొప్పరపు తాయారు
వానాలు కురవాలి 
వరి చేలు పండాలి 
మొదలు పాటలు 
రైతుల పెదాలపై 

నవ్వులు విరబూయు
భవిష్యత్తుకు బంగరు బాటలు 
మృగశిర ఆగమనం 
సంకేతం వానలకి 

హాయికి, చల్లదనానికి
ఆరోగ్య సూత్రాలకు 
చేప మందులకు 
వచ్చింది వచ్చింది 

మృదు మధర మృగశిర, 
అతి ముఖ్యమైన బోనాల 
పండగల ఉత్సవాలతో 
అలరించ అందరూ 

ఉత్సవాల ఊరేగింపులు 
ఘనమైన సత్కారం 
ఆనందాలు పంచు 
 ఐకమత్యం పెంచు 

జీవితం సుఖం  వైపు 
మదిని మొగ్గు చూపు 
రైతుకి పొలం వైపు 
మనుగడకు దారి చూపు 

జీవితాన ఆనందాల 
సంకేతాలు అపురూపం గా 
నిని దించు ఈ అందాల 
మృగశిర హాయిగొలుపు
 మృగశిర !


కామెంట్‌లు