భరతుడు _గుహుడు! అచ్యుతుని రాజ్యశ్రీ
 రామాయణం లో అద్భుత వ్యక్తి అందరిచేత అనుమానం తో చూడబడిన వాడు భరతుడు కైక దశరథుల కొడుకు రాముని తర్వాత రెండో కొడుకు.అన్నని అడవి నుంచి తెచ్చి పట్టాభిషేకం చేయాలి అని ససైన్యంగా తల్లుల్తో బైలుదేరాడు.ముందుగా పశ్చాత్తాపంతో కైక బైలుదేరింది.ఇక్ష్వాకు వంశరాజుల చిహ్నం కోవిదారవృక్షం.దానికి రెండేసి ఆకులు గుత్తులు గుత్తులుగా పూలుంటాయి.భూమిలోపలికి త్వరగా తన వ్రేళ్ళు పోనిచ్చి బాగా ఎదిగి నీడనిస్తుంది.అయోధ్య అంటే శత్రుదుర్భేద్యనగరం.
భరతుని సైన్యం చూసిన ఆటవికుడైన గుహుడు ఎంత సమయస్ఫూర్తి ప్రదర్శించాడో చూడండి.
500 పడవల్లో 100మంది యుద్ధ యోధుల్ని సిద్ధం చేసి భరతుని అంతరంగం తెల్సుకోవాలి అని పళ్ళు పూలు తేనె మాంసం తో భరతుడున్న ప్రాంతం కి వెళ్లాడు.సుమంతుడు గుహుని రాకను భరతునికి చెప్పగానే వెంటనే లోపలికి పంపమన్నాడు భరతుడు.అవతలివాడి కులం తో పనిలేదు.భక్తిని చూశారు సుమంతుడు భరతుడు.
2 " భరతా! సైన్యంతో ఎందుకు వచ్చావు?" గుహుడు సూటిగా ప్రశ్నిస్తే "మా రఘుకులంలో అన్నదమ్ముల అనుబంధం ఆత్మీయత ఆదర్శం.ప్రజాక్షేమం మాలక్ష్యం.అన్న రామునికి పట్టాభిషేకం చేయాలి అని
మాముగ్గురు అమ్మలతో సహా వచ్చాను.అన్నగూర్చి చెప్పు.మాఅమ్మ సుమిత్ర మైత్రీ భావం కల్గిన ఆమె కడుపున పుట్టిన లక్ష్మణుడు అదృష్టవంతుడు." అప్పుడు గుహుడు నిషాదుడు ఇలా చెప్పాడు" నేను తెచ్చిన మర్రిపాలతో జుట్టుని శిఖలాగా చుట్టు కున్నారు.ఆఒక్కరాత్రి నేను అరటి దొప్పలు తెస్తే లక్ష్మణుడు దర్భలు పరిచాడు.రాముడన్నాడు_ మేము క్షత్రియులం.ఆహారం తినరాదు ఈసమయంలో.జనాల కడుపునింపాలి అనేది మావంశం ఆచారం.గంగాజలం తాగితే మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది.తీసుకునిరా"
ఈమాటలు వింటున్న భరతుడు పచ్చని చెట్టు తొర్రలో దాగున్న అగ్ని లాగా బాధతో కుళ్లిపోతూ
తనపై వచ్చిన అపవాదు కి బాధపడసాగాడు.
3రాముడంటే లలితా గాయత్రీ అమ్మవారు.ఆమెయే గ్రామ దేవత గా పెద్దింటమ్మ పోలేరమ్మ గా పిలువబడుతోంది.శ్రీకృష్ణుడు శ్యామలాదేవి స్వరూపం.ఇక ప్రతిపేరుకి విశిష్టత ఉంది.సుమిత్ర అంటే మిత్రుడు భక్తి దైవం వైపు నడిపించేవాడు.కౌసల్య కోసలదేశపు రాకుమార్తె.కైక 
కేకయరాజు కూతురు.తండ్రి రాజ్యం పేరుతో వారు చెలామణి ఐనారు. కానీ సుమిత్ర తన పేరు తోనే ప్రసిద్ధి కెక్కినది.

కామెంట్‌లు