సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు -533
తటాదర్శి శకుంతపోత న్యాయము
*****
తట అంటే ఒడ్డు.దర్శి అంటే దర్శనము, శాస్త్రము,చూపు,కన్ను. శకుంతము అనగా పక్షి.పోత అంటే పిల్ల అని అర్థము.
ఒడ్డు తెలియని పక్షిపిల్ల వలె.
సముద్రములో పడిపోయిన ఓ పక్షిపిల్ల ఒడ్డుకు చేరవలెననే ప్రయత్నంతో  ఎగురుతూ నలువైపులా కలయ చూస్తుంటే అంతా జలమయంగానే దానికి కనబడింది. అలా ఎంత ఎగురుతున్నా ఒడ్డు కానరాక అందులోనే తాను ఎగిరిన చోటనే  పడిపోతోంది. గత్యంతరం లేక బాధతో తన ఒంటరి స్థితికి విచారిస్తూ ఎలా చేరుకోవాలో ప్రయత్నం చేస్తోంది అని అర్థము.
దీనికి సంబంధించిన ఓ కథను చూద్దామా...అనగనగా ఒక పక్షి జంట.సముద్రం ఒడ్డున ఉన్న ఓ చెట్టు పై గూడు కట్టుకుని నివసిస్తోంది.ఆ జంటకు పక్షి పిల్ల వుంది. తల్లిదండ్రి పక్షులు మేతకు వెళ్ళేముందు తమ పిల్ల పక్షికి ఎన్నో రకాల జాగ్రత్తలు చెప్పి వెళ్తుంటాయి.అయినా ఆ పక్షి పిల్లకు బయట అంతా చూడాలనే కోరిక ఆపుకోలేక పోయింది. ఓరోజు తల్లిదండ్రులు లేని సమయంలో కిందికి చూస్తూ ఎగిరింది.ఒంట్లో శక్తి చాలక సముద్రంలో పడిపోయింది. అందులోంచి లేచి ఎంత ఎగిరినా అక్కడక్కడే పడిపోతోంది తప్ప ఒడ్డుకు చేరుకోలేక పోయింది.ఆ  తర్వాత పక్షి పిల్ల తల్లిదండ్రి పక్షులు వచ్చి రక్షించాయా? లేదా? ఏమైంది ?అనేది తర్వాతి విషయం.
 ఇలా పెద్దలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పెడ చెవిన పెట్టి ప్రవర్తించే వారిని, సరైన నిర్ణయాలు తీసుకోలేని వారిని ఉద్దేశించి ఈ "తటాదర్శి శకుంతపోత న్యాయము"ను మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
 అలాగే అతిశయించిన ఆశ లేదా  కోరిక మనుషులను నిలకడగా ఉండనివ్వదు. ఇలా పక్షి పిల్లకు వలె కష్టాల కడలిలో కూరుకు పోయేలా చేస్తుందనే అర్థంతో ప్రజాకవి వేమన రాసిన పద్యాన్ని చూద్దామా...
 "కడిగి వట్టి యాస కడతేర నివ్వదు/యిడుములందు బెట్టి యీడ్చు గాని/ పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు/ విశ్వదాభిరామ వినురవేమ/"
అనగా అలవిగాని ఆశ/ కోరిక వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు.పైగా అలాంటి ఆశ అనుకున్న దానిని నెరవేరనివ్వదు.అంతే కాదు కష్టాల పాలు చేస్తుంది. అలా కష్టాల్లో ఉన్నప్పుడు అటూ ఇటూ లాగి మనసును ఊగిసలాడేలా ఎటూ కాకుండా చేస్తుంది.కాబట్టి భక్తి అనే మార్గం లేక పోతే ముక్తి అనే గమ్యం లేదా ఒడ్డుకు చేరలేము అని అర్థము.
 అందుకే  మన పెద్దలు మనసును పక్షి పిల్లతో పోల్చారు. పిల్లలకు స్వంతంగా ఏది మంచి? ఏది చెడు? ఏది తప్పు? ఏది ఒప్పు? అనే విచక్షణతో ఆలోచించే తెలివితేటలు ఉండవు. అందుకే పెద్దవాళ్ళు పదే పదే హితోక్తులు, నీతి కథలు చెబుతుంటారు. అవి  విని ఆచరణలో పెట్టిన వారు ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా అనుకున్న గమ్యం చేరుతారు.
 అలా వినకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారు సముద్రంలో పడిన పక్షి పిల్లలా ఒడ్డుకు చేరలేక గిలగిలా కొట్టుకుంటారు.అందుకే మన పెద్దలు "చెప్పితే వినకపోతే చెడంగ చూస్తాం" అంటుంటారు.
 ఈ లెక్కన గిజిగాడి పిల్లలు  ఎంత బుద్ధి మంతమైనవో కదా ! ఎందుకంటే గిజిగాళ్ళు ఎప్పుడూ చెట్టు కొమ్మకు చివర్లో అది కూడా బావుల అంచున వుండే చెట్లకు గూళ్ళు కట్టుకొంటాయి. వాటి పిల్లలు చెప్పిన మాట వింటాయి కాబట్టి ఎలాంటి అపాయానికి లోనవ్వకుండా పెరిగి పెద్దవుతాయి.
 ఈ "తటాదర్శి శకుంతపోత న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఒడ్డు తెలియని పక్షి పిల్లవలె కాకుండా మన మనసును అదుపులో పెట్టుకొని అలవి కాని కోరికల జోలికి పోకుండా పెద్దల మాటలతో సహా పెద్దల వంటి మంచి బుద్ధి మాటలు విని అపాయాల బారిన పడకుండా ఆనందంగా జీవిద్దాం. అంతే కదండీ.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం