ఓ కవీ!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కుదిరితే బ్రహ్మాండంగారాయి
లేకపోతే బాగుగారాయి
అదీ చేతకాకపొతే మాములుగారాయి
అంతేకాని
చేతులు కట్టేసుకొని
ఆలోచనలు ఆపివేసి
కలాలు వదిలేసి
కాగితాలు విసిరేసి
సాహిత్యసన్యాసం పుచ్చుకొని
గమ్మున ఉండబోకు

చక్కదనాలు చూపించు
సంతసాలు కలిగించు
అక్షరాలను ముత్యాల్లాగుచ్చు
అలంకరించుకొనమని ఆహ్వానించు
పదాలను పసందుగాప్రయోగించు
పాఠకులమదులు దోచుకొను
సాహితీకుసుమాలు విరజిమ్ము 
సుమపరిమళాలు వెదజల్లు
కవితలను కమ్మగాపాడు
గాంధర్వగానంతో అలరించు


కామెంట్‌లు