బొమ్మరిస్పేట్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి; వెంకట్ మొలక ప్రతినిధి

 ఆచార్య కొత్తపల్లి వర్ధంతి సందర్భంగా బొమ్రాస్పేట పట్టణంలోని మండల తాసిల్దార్ ఆవరణలో మరియు ఎంఆర్సిసి ఆవరణలో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ. జయశంకర్ వర్ధంతి సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు,ఎమ్మార్వో ఎంపీడీవో నోడల్ ఆఫీసర్ గారితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
 ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని విద్యావంతుల వేదిక నాయకులు అన్నారు 
అదేవిధంగా మండల అధికారులు తాసిల్దార్, ఎంపీడీవో మండల నోడల్ ఆఫీసర్ గార్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను జాగృతం చేయటంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో సమున్నతమైనదని శ్లాఘించారు. తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. 

కామెంట్‌లు