ఎంతోమంది ఋషులు ప్రశాంతమైన స్థలాన్ని ఎన్నుకొని తన జీవనానికి అక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకొని తపస్సు చేయడానికి వెళుతూ ఉంటారు అని మనం కథలుగా చదువుతూ ఉంటాం అసలు తపస్సు అంటే తపించడం తనను తాను దహించుకోవడం నేను జీవించినంతవరకు తనకు అరిషడ్ వర్గాలు చుట్టే ఉంటాయి అవి అభిప్రాయానికి వచ్చి వాటిని దూరం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అహం బ్రహ్మాస్మి అని తెలిసి ఆ నేను అనేది ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది అని తెలుసుకోవడం కోసం తపస్సు కొనసాగిస్తారు తన కోరికలు తీర్చుకోవడం కోసం భగవంతుని ప్రత్యక్షం చేసుకుని తనకు కావలసిన మోక్షానికి సంబంధించిన కోర్కెలు కోరుతూ ఉంటారు.కొంతమంది రాక్షసులు కూడా తపస్సులు చేసి భగవంతుని ప్రేమకు పాత్రులై సమాజంపై కానీ వ్యక్తులపై కానీ తమకున్న ద్వేషాన్ని కసిని తీర్చుకోవడానికి కొన్ని వరాలు అడుగుతూ ఉంటారు వారు కోరిన కోరికలు అక్రమమని తెలిసి ఏవో మతలబులు పెట్టి ఆ వరాలను ప్రసాదిస్తూ ఉంటారు దానివల్ల వారే పతనం కావడం కూడా కొన్నికథలు విన్నాము ఏ భగవంతుడు వరాలిస్తాడో ఆ భగవంతున్ని మటుమాయం చేయడం కోసం ఒకరిద్దరు తపస్సు చేసి శివుని ద్వారా వరాలను పొంది శివుని భష్మీ పటలం చేయాలని ప్రయత్నించి చివరకు తామే జీవితాన్ని అగ్నికి ఆహుతి కావటం కూడా మనకు తెలిసిన కథయే కానీ ఇక్కడ బుద్ధ భగవానుడు చేసిన తపస్సుకు మిగిలిన వారు చేసిన తపస్సుకు సంబంధమే లేదు.తన జీవితంలో ఎదురైన మానవుని కష్టాలను తీర్చడం కోసం వారి మనసు ప్రశాంతంగా ఉండడం కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలన్న సదుద్దేశంతో తన బుద్ధిని సక్రమంగా వాడి దానిని సక్రమమైన మార్గంలో నడిపించుకుంటూ శ్రీరామచంద్రమూర్తి లాంటి ఆదర్శమూర్తుల ప్రతి ఒక్కరూ వెలుగొందాలని తాను తన శరీరం శుష్కించిన లక్ష్య పెట్టక తన ఆశయ సాధన కోసం చివరి వరకు తపస్సు చేసి సత్యాన్ని గ్రహించి తాను తెలుసుకున్న ప్రతి అక్షరాన్ని సామాన్య జనులకు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి తన జీవితమంతా ధార పోసిన త్యాగశీలి అలాంటి వారి చరిత్రలు తెలుసుకుంటే ముందు మనకు ప్రశాంతత ఏర్పడుతుంది అలాంటి అభిప్రాయంతో ప్రతి ఒక్కరికి ఆయన జీవితంలో జరిగిన ప్రతి అంశము మన ముందుకు తీసుకొస్తూ దానిని ప్రజా భాషలో తెలియజేసిన శివ నాగిరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
-------------------------------------------
సమన్వయం ; డా . నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి