'శంభో!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 (కందములు )
============
66.
 చరణములే విడువక నీ
చరితములే వింటి నయ్య!సద్గతి నొందన్
నరకము లో బడనీయక
దరిగొని ముక్తి నొసగర!సదాశివ!శంభో!//
67.
 తిరునాళ్లను జేయుచు మా
పరివారము తోడ వచ్చి భక్తిగ నీకై
జరిపితి మయ్యా!సేవలు
గిరిజాపతి శంకర!మము కృపగొను శంభో!//

68.
నీసరి దైవము లేడని
చేసితి బూజలు సతతము జెన్నుగ నీకై
భూసుర వంద్యా!కర్మల
వాసన ద్రుంచుమ!కనుగొని భవహర!శంభో!//
69.
 నలుదిక్కుల నీ రూపము
వెలుగుచు నుండఁగ తిరముగ విభవము తోడన్
సురమును లెల్లరు ముదముగ
బలుమారులు మ్రొక్కు చుంద్రు ప్రణతుల శంభో!//

70.
కల హంసలు శుక పికములు
కలకల రావములు సలుప గమనీయముగా
నల మందాకిని  తటమున
గొలువైన హర! నిను జూడ గోరితి శంభో!//

కామెంట్‌లు