నిరుద్యోగం రూపుమాపాలి ;- సి.హెచ్.ప్రతాప్
  ప్రపంచంలోనే ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్‌ అవతరించడం సంతోషకరం. అయితే మనదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు పెరగడం లేదు. ప్రజల సంఖ్య పెరుగుతోంది కానీ, వారికి ఉద్యోగ ఉపాధులు ఉండడం లేదు. దీంతో నిరుపేద, పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవుల జీవనం ఏరోజు కారోజు అస్తవ్యస్తంగానే ఉంటున్నదే తప్ప ఆశించిన స్థాయిలో మెరుగుదల ఉండడం లేదు అని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాతి.
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. ఇప్పటి వరకు విద్యావంతులు, చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న భారత్.. భవిష్యత్తులో డిమాండ్‌కు తగినంత యువ కార్మిక బలగం అందుబాటులో ఉండదని హెచ్చరికలు జారీ చేసింది.గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 29.1శాతంగా ఉంది. ఇక, భారతదేశంలో నిరుద్యోగం ప్రధానంగా యువతలో సమస్యగా మారింది.భారతదేశంలో యువత నిరుద్యోగం రేట్లు ఇప్పుడు ప్రపంచ స్థాయిల కంటే ఎక్కువగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ కొత్త విద్యావంతులైన యువ శ్రామిక శక్తిలో ప్రవేశించిన వారికి వ్యవసాయేతర రంగాలలో తగినంత వేతనంతో కూడిన ఉద్యోగాలను సృష్టించలేకపోయింది.సెప్టెంబర్‌లో సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన ఆరు నెలల కనిష్ఠానికి చేరిందని పేర్కొన్నది. ఆగస్టు నెలలో 9,53,092 మంది కొత్త సబ్‌స్ర్కైబర్లు నమోదు కాగా, అది సెప్టెంబర్‌లో 6.45 శాతం పడిపోయి 8,91,583 మంది సబ్‌స్ర్కైబర్లు నమోదయ్యారని వెల్లడించింది.
దేశ కార్మిక శక్తిలో 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ఆధునిక సాంకేతికత ప్రజల నిత్యజీవితాల్లో ఉనికిని పెంచుకున్న కొద్దీ సంప్రదాయ వృత్తులు నాశనమైపోవడం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటుకాక దాని అనుబంధ వృత్తులు కూడా చతికిలబడి పల్లెల నుంచి పట్టణాలకు నగరాలకు వలసలు  పెరిగాయి.

ప్రభుత్వ బడ్జెట్ లో ఆరోగ్యం, విద్య వంటి ప్రాధాన్యత గల రంగాలకు నిధులు కేటాయింపు నామమాత్రంగా ఉండడం వల్ల మానవవనరులపై ప్రభావం చూపుతుందని మేధావుల విశ్లేషణ. వ్యవసాయ రంగం కూడా కుదేలైపోయింది.  మొత్తంగా దేశంలో నేడు కోట్లాదిమంది పేదలు, కార్మిక కర్షకుల పరిస్థితి, ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువత పరిస్థితి మరింత దయ నీయంగానే ఉంటోంది. గత మార్చి నెలలో దేశంలో నిరుద్యోగం 7.8 శాతం ఉంటే, ఏప్రిల్‌లో అది 8.11 శాతానికి చేరుకోవడం గమనార్హమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. గత డిసెంబరు 2022 తర్వాత ఇంతగా గరిష్ట స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే మొదటిసారని పలు గణాంకాలు తెలియజెస్తున్నాయి.యువత, విద్యార్థులు దేశభవితకు వెన్నెముక లాంటివారు.కాబట్టి వారికి ఆశించినస్థాయిలో నైపుణ్యత, వృత్తిపరమైన ప్రతిభాపాటవాలు పెంపొందించేం దుకు తగిన కృషి చెయ్యడం ఎంతో అవసరం.ప్రభుత్వాలు తమకు ఎదురౌతున్న సవాళ్ళనుఅధిగ మించి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న జనాభాను శక్తివంతంగా మార్చుకోవాలి.  

కామెంట్‌లు