సుప్రభాత కవిత ; -బృంద
చిగురు తొడిగిన ఆశకు
చిన్ని ఊతమిచ్చి
చింతను కలిగించే
చిక్కును విడదీసి....

మనసు చిక్కబట్టుకుని
మమతను పంచి పోషించి
మరపు రాని గాయానికి
మందుగా భావించి ....

కోటి వరములు 
కొంగు నింపిన తీరున
కోరిక తీర్చి మురిపించి
కోతకు గురైనా ....రాత మార్చి

తెలియక చేసిన పాపమో
తెలిసీ తగిలిన శాపమో
తెరలు వేసిన మనసుకు
తడి తగిలేలా చేసి......

గతము తప్పైనా
హితము కాకున్నా
ఒప్పులు చేసి రేపును
గొప్పగా మలచుకునేలా చేసి

కంట చెమ్మ ఆరనీక
కలతలు కమ్ముకున్నవేళ
కలలు కనడానికైన కాస్త
కనుల నిండ నిదుర రానివేళ

కనిపించని చేయేదో
ఊహించని ఊతమిచ్చి
చేదోడుగా చివరి వరకూ
నేనుంటానని ధైర్యమిచ్చే

వెతలు తీర్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు