మోసే కాడి ఇంటినీ
ఇంటి బతుకునూ గౌరవంగా లాగే బండి
అన్ని కాలలోనూ బతుకు
వడ్డించిన విస్తరికాదను సత్యం మనకు నేర్పిన గొప్ప పుస్తకం
పేజిపేజీలో తన ముద్ర గీసిన అస్తిత్వ కావ్యం
చిటికెనవేలు ఊతం స్థిరచిత్తమై నడిపించిన రక్తదీపం
నడక అడుగడుగున మాట్లాడే నిశ్శబ్ద బింబప్రతిబింబం
మనసు అమ్మే
సరిచేసి సవరించే చూపుడువేలు నేత్రం నాయిన
బతుకుదారిలో ఆర్తి కోపం మంచినేర్పే ప్రేమ రాగం
మౌనంగానే మాట పూచే మోదుగు పూల లోకం
నింగీనేలను నిలదీసే ఆత్మీయ అక్షయ అక్షర నేస్తం
కోప్పడ్డా కొట్టినా తనైన పిల్లల సవరణ సంరక్షణల దడి నాయిన
గడబిడ దడదడ శబ్దసంకేతాలను డీకోడ్ చేసి చూపిన మార్గదర్శి
బతుకున దార్శనికుడు
చలనాచలనాల సంచలన బిందువు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి