మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 ఈ చక్ర స్నానానికి కారణం ఏమిటి అని అనేక సంవత్సరాలు ఎవరిని అడిగి  నా సరి అయిన సమాధానం రాదు  ఈ శాసనం వాళ్ళ బ్రహ్మోత్సవం పూర్తయిన తర్వాత చక్ర స్నానమని  చెప్పవచ్చును  పల్లవ వంశీకులైన కోపార్తి వేంద్ర వర్మ కాలంలోని శాసనము వలన ఏర్పడినది  ఆ వర్మ తమ 14వ సంవత్సరపు పాలన లో శ్రీవారికి   ధనుర్మాసములో ముక్కోటి ద్వాదశికి ముందు దినమునకు రెండు బ్రహ్మోత్సవాలు ఏడు దినములు జరుగునట్లు నియమించి  అందుకు నలఫై ఏడు వేల ఆరు వందల  నాలుగు గుంటలకు స్థలం ఏర్పాటు చేశారు  కాలక్రమీణ హిందూ రాజుల పరిపాలన పోయిన తర్వాత కొన్ని బ్రహ్మోత్సవాలకు చక్ర స్నానం  మాత్రం మిగిలింది.
మరికొన్ని  బ్రహ్మోత్సవాలకు రూపు లేకపోయింది  రథసప్తమి ముందు బ్రహ్మోత్సవం మాత్రము ఏడు ఉత్సవములు చక్ర స్నానము ఒకేరోజు జరిగినట్లు ఏర్పాటు చేశారు  పూర్వం బ్రహ్మోత్సవానంతరం జయంతి ఉత్సవం  జరుగుతున్నట్లుగా 1814వ సంవత్సరం అంగీరస సంవత్సర శాసనము వలన నందవనములోనూ  పూల మండపానికి శ్రీవారు విజయం చేసినట్లు ఏర్పడుతున్నది  నందవనములందరి అనేక మండపములు చూడగా  మనకు కలిగిన సందేహాలన్నీ ఈ శాసనం వల్ల నివృత్తి అయిపోతాయి  హిందూ రాజుల కాలంలో శ్రీవారికిని వేదనల పరిమితముగా ఉండాలని ఇదివరలోనే చెప్పుకున్నాం  ఇంత నివేదన యు ఎప్పటివలినే శ్రీవారికి ప్రతినిత్యము నీయమిత కాలమైన  పగలు రెండుసార్లు రాత్రి రెండుసార్లు నివేదన అగుచుండెను.లేక ఇంకను ఎచ్చుసార్లు అని వేదన అగుచుండెనా అని దేవస్థానం అనుభవం కలవారికి ఈ సందేహము కలుగును పూర్వము అఛ్యుయుతతరాయుల సంధి అని కొన్ని గంగాళములు నివేదన ప్రతినిత్యము ఉండేది ఇదే మాదిరిగా అనేక రాజుల పేర్లతో అనేక  నివేదనలు ఉన్నాయి  సంధి అనగానేమి ఇప్పుడు రెండవ గంట  అయిన తర్వాత స్వల్పమైన చప్పిడి ప్రసాదం సంటి  ఈ సంధి రెండు సేవలు మధ్యకాలం  మోనో సంధి అంటారు  అప్పుడు సప్పిడి ముద్ద కొట్టి అన్నం నైవేద్యం సమర్పిస్తారు ఆ అన్నం తీసుకున్న వారు ఇంటికి పోయి కూరలు వండుకొని కలుపుకొని తినాలి మునుపు సత్రాలకు రామానుజ పూటలకు ఈ చప్పిడి ముందర ఇచ్చేవారు ఆలయంలో కూరలు తయారు చేయడం కుదరదు కదా అందుకని ఈ ఏర్పాట్లు.


కామెంట్‌లు