ఆదిలాబాద్, నార్నూర్ :- మహారాష్ట్రలో కొలువైన సింగ్నాపూర్ శని దేవాలయం ఎంత దూరమైనా దేశవ్యాప్తంగా భక్తులు వెళ్తుంటారు.ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామ యువకుడికి ఓ ఆలోచన తట్టింది.భీంపూర్ నుండి 750 కి.మీ సుదూర ప్రయాణం చేసి అంత దూరం వెళ్లడమెందుకు స్థానికంగా ఓ ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు.ఈ ఏడాది జనవరిలో శని దేవాలయం భీంపూర్ పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి భీంపూర్,కొత్తపల్లి ,మహాగామ్,సోనాపూర్,నాగల్ కొండ, తాడిహత్నూర్,మలంగి,ఉమ్రి, రాజుల్ గూడ,గంగా పూర్,ఎంపల్లి, కొత్తపల్లి హెచ్, తదితర గ్రామాల ఉద్యోగులు,రైతులు,యువత చరవాణి సంఖ్యలు గ్రూపులో పెట్టి శని దేవుని మందిర నిర్మాణం కోసం విరాళాలు కోరారు. సింగాపూర్ తరహాలో భీంపూర్ గ్రామంలో మూడు నేలల వ్వవధిలోనే శని దేవాలయాన్ని నిర్మించారు. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర లోని చంద్ర పూర్,వార్ధా,యవత్మాల్,హింగన్ ఘాట్,ప్రాంతాల భక్తులు శనివారం పూజ చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు.
గ్రూపు కటించిన గుడి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి