న్యాయాలు-535
తస్కర కందుక న్యాయము
******
తస్కర అనగా దొంగ. కందుక అనగా అనగా బంతి అని అర్థము.
బంతిని దొంగిలించిన ఓ దొంగ వంటవాడుగా మారినా తప్పని తిప్పలు అన్నట్లు."
దొంగ వంటవాడుగా మారడం ఏమిటి?అలా ఎందుకు వంటవాడి అవతారం ఎత్తాల్సి వచ్చిందనేది ఆశ్చర్యం కదా! మరి ఆ ఆసక్తికరమైన కథేమిటో చూద్దామా...
ఒకానొక దొంగ రాజుగారి భవనంలోకి దొంగతనానికి వెళ్ళాడు. అక్కడ భటుల కళ్ళు గప్పి దొంగతనం పెద్ద దొంగతనం చేయలేక పోయాడు.అతడి కంటికి గాజుగారి కుమారుడు ఆడుకునే అందమైన బంతి కళ్ళలో పడింది. వెంటనే దానిని తీసికొని పరారయ్యాడు.
ఆ బంతి విలువైనదా! కాదా! అనేది తర్వాతి విషయం.కానీ జరిగింది దొంగతనం.అది రాజు గారి తాలూకు బంతి. వెంటనే భటులను బంతిని తస్కరించిన దొంగను పట్టుకొమ్మని భటులను ఆదేశించాడు.
దొంగ వారి నుండి ఎలాగోలా తప్పించుకున్నాడు ."బతుకు జీవుడా" అనుకుంటూ వేషం మార్చుకుని ఓ ధనికుడి ఇంట్లో వంటవాడిగా చేరాడు. ఆ ధనికుడికి అతడు దొంగ అని తెలియకపోవడం వల్లనూ ,అతడు "కాళ్ళావేళ్ళా పడటం"తోనూ పదుగురిలో ఒకడుగా వుంటాడులే అనుకుని నియమించుకున్నాడు.
కానీ భటులు మామూలు వాళ్ళు కాదు. దొంగ కోసం అంతటా గాలించారు. అనుమానం కలిగిన ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయసాగారు. అలా చేస్తూ చేస్తూ దొంగ ఉన్న ధనికుడి ఇంటికి వచ్చారు.
అక్కడ ఉన్న పనివాళ్ళతో సహా అందరినీ పరీక్ష చేశారు.పనిలో పనిగా వంట వాళ్ళను పరిశీలించారు.వంట పనిలో నేర్పు లేక తడబడుతున్న వ్యక్తిని గమనించారు .అతడే దొంగ అని నిర్ధారణ అయింది. పట్టుకుని రాజుగారికి అప్పగించారు.
ఈ కథ ద్వారా మనం రెండు రకాల విషయాలు తెలుసుకోవచ్చు.ఒకటేమో తప్పు చేసిన వాడు ఏనాటికైనా ఏదో ఒక సందర్భంలో తప్పకుండా పట్టుపడతాడనీ.ఇక రెండవ విషయానికి వస్తే చేసిన తప్పును ఒప్పుకుంటే దొంగిలించింది బంతే కాబట్టి శిక్ష కొంచెం తగ్గేదేమో లేదా అతనిలో మార్పు కోసం సరిదిద్దే విధంగా కొంత సంస్కరణ జరిగేదేమో.
కానీ అలా కాకుండా తనకు రాని వంటపనిలో ప్రవేశించాడు.తప్పును సరిదిద్దుకుని బతకాలి అనుకున్నప్పుడు చేసింది చిన్న దొంగతనమే కాబట్టి ఇక నుంచి నిజాయితీగా ఉంటానని చెప్పినట్లయితే... ఆ ధనికుడికి మంచితనం మీద నమ్మకం ఉన్నట్లయితే అతడిని రక్షించే వాడు.
లేదా ఆ దొంగను తానే పట్టుకుని సరాసరి రాజుగారి సన్నిధికి తీసుకుని వెళ్ళేవాడు. ఎవరో తెలుసుకోకుండా ఆశ్రయం ఇచ్చిన ధనికుడికీ మందలింపు తప్పలేదు. దొంగకూ శిక్ష తప్పలేదు.
"రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదు / శనేశ్వరుడు వెంటాడుతూనే వుంటాడు" అన్నట్లు దొంగతనం మాని వంటవాడుగా మారినా అతని గతం వెంటాడి పట్టించింది.
అందుకే పెద్దలు తరచూ అంటుంటారు "అడుసు తొక్కనేల- కాలు కడుగ నేల" అని. బురద లాంటి దొంగతనం చేయడం ఎందుకు? దానిని సరిదిద్దుకోవాలని చేసిన ప్రయత్నంలో అంటిన బురద పూర్తిగా పోనట్లు, వచ్చిన చెడ్డ పేరు పోతుదా?అందుకే అలాంటి పనులు చిన్నవైనా పెద్దవైనా చేయకుండానే వుండాలి. అనేది ఈ "తస్కర కందుక న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
ముఖ్యంగా చిన్నతనంలో పిల్లలు కొందరు తెలిసీ తెలీక బడిలో ఇలాంటివి చేస్తుండటం చూస్తుంటాం. (పక్క పిల్లల పెన్నో,పెన్సిలో, నోట్ బుక్కో తీస్తుంటారు ) అలాంటి వారికి ఇలాంటి "తస్కర కందుక న్యాయము" లాంటి కథలు చెప్పే బాల్యంలోనే తప్పు,ఒప్పులేవో అర్థం చేయిస్తూ నైతిక విలువల్ని నేర్పించాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి