రక్తదానం .. మహాదానం;- సి.హెచ్.ప్రతాప్
 రక్తం మానవ శరీరంలోని కణజాలాలకు పోషకాలను, ఆక్సిజన్‌ను సరఫరా చేసే ద్రవం. ఇది మనిషి శరీరంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ద్రవపదార్థం. ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో ఐదు లీటర్ల వరకూ రక్తం ఉండాలని డాక్టర్స్ చెపుతారు. ఒకవేళ ఒంట్లో రక్తం తక్కువైతే.. తగిన మోతాదులో ఐరన్ లేకున్నట్టయితే.. చాలా రకాల వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ఎనిమియా ఈ కారణాలతోనే వస్తుంది. భారతదేశంలో తరచుగా వచ్చే పలు అనారోగ్య సమస్యలలో రక్తహీనత మొదటి స్థానంలో ఉంది. శరీరంలో సరిపడినంత రక్తం లేకపోవడం ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది.
మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ప్రమాదకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారు. రక్తం గ్రూపులు వేరైనా.. రంగు మాత్రం ఒక్కటే.. రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఏడాది జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.సకాలంలో రక్తం అందక చనిపోతున్నవారు ఎందరో వున్నారు.. అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుంది. దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమవుతుంది. సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపడవచ్చు.మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరోకరికి ప్రాణదానం చేసినవారవుతారు.మనం క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే, శరీరంలో ఐరన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది.రక్తం మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన బహుమతి. రక్తదానం చేయడం అంటే ఓ మనిషికి జీవనదానం చేయడమే.అర లీటరు రక్తదానం చేయడం ద్వారా దాదాపు 650 కేలరీలు తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధనలు చెబుతున్నాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు రక్తదానం చేయడం వల్ల త్వరగా బరువును కోల్పోయి సాధారణస్థితికి వస్తారని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కామెంట్‌లు