ఏమి నీ వైఖరి....?! ; - కొరాడ నరసింహా రావు...!
అది చెడు... అని తెలుసు
 చేస్తున్నది తప్పు అనీ తెలుసు
 లైసెన్సు లిచ్చిమరీ ప్రోత్సహిస్తా0..! 

ఎందుకు...!? 
 ధూమ, మద్య పానాలు... 
 గొప్ప ఆదాయ ఒనరులుగనుక....! 

వీళ్ల తాత్కాలిక లబ్ధికి
 అంతకు పదింతల ఆరోగ్య పరి రక్షణ ఖర్చు.....! 

వాళ్ల  క్షణికానందవినో దానికి
 ఆ జీవితము,కుటుంబమూబ లి..!! 

ఈ మనిషి మేధావి తనానికి
 మెచ్చుకోవాలా, నొచ్చుకోవాలా
 యువతనురెచ్చగొట్టే సన్నివేసాలను 
అంతవరకూ చూపించి చివరిలో...

 
ఇలా చెడిపోకండి అంటూ హితబోధ

కర్ర విరగదు... పాముచావదు
 ఆహా .. సమాజమా....! 
  ఏమి నీ వైఖరి....?! 
           ******

కామెంట్‌లు