శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
906)అరౌద్రః -
-----------------
రౌద్రము లేకుండునట్టివాడు 
భయము గొల్పనితీరున్నవాడు 
శాంతిని ఒసగుచున్నవాడు 
తీక్షణతను చూపించనివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
907)కుండలీ- 

మకరకుండలాలు ధరించువాడు 
గుండ్రని చెవిపోగులున్నవాడు 
కమండలమును చేపట్టినవాడు 
కుండలీ నామముగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
908)చక్రీ -

చక్రాయుధమును కలిగినవాడు 
సుదర్శనము చేతనున్నవాడు 
విష్ణుచక్రమును ధరించినవాడు 
చక్రి నామధేయముగలవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
909)విక్రమీ- 

గొప్పశూరుడైయున్నట్టి వాడు 
విజయుడైయున్న భగవానుడు 
అధికబలముతో విజ్రుoభించువాడు 
వీరత్వము చూపించుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
910)ఊర్జిత శాసనః -

ఉల్లంఘనము లేని శాసనకుడు 
విడువలేని ఆజ్ఞలనిచ్చువాడు 
ఆచరణమగు వాక్కులవాడు 
వదలలేనట్టి మార్గదర్శకుడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు