నా ఆలోచన;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 జీవితంలో ఏదో చేయాలనుకుంటాము అది శాశ్వతంగా నిలిచి పోయేలా ఉండాలని అభిప్రాయపడతాం అయితే దానికి ఎలాంటి ప్రాతిపదిక ఉండాలి నలుగురిలో నానుతూ చాలాకాలం ఉండాలి అన్న  ఏ విషయాన్ని నీవు ఎన్నుకున్నావు దాని ఆనుపానులు నీకు తెలుసునా  దానిని ఎలా నిర్వహించాలో అది ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే  అది తప్పకుండా విజయవంతం అవుతుంది  అలా కాకుండా గాలిలో మేడలు కట్టుకుంటూ వెళితే దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండకపోగా  ఆ విషయాలు నువ్వు నోటితో చెప్పినప్పుడు అందరికీ నీవు చులకన అవడం మాత్రం  తప్పదు  అందుకే ఆలోచనలతో సరికొచ్చుకోకుండా బుద్ధితో ఆలోచించి  ఇది సాధ్యమా అసాధ్యమా అన్న విషయాన్ని గమనించి  దానికోసం  ప్రయత్నించాలి.బుద్ధ భగవానుడు ఎంతో దీర్ఘంగా ఆలోచించి  ఏ విషయం సమాజానికి ఉపయోగపడుతుంది  మనం దేని గురించి  నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచించి  ఏకాంత ప్రదేశంలో వనంలో  తపస్ సమాధికి వెళ్లడం  దానిలో విజయాన్ని సాధించి దాని మూలాలను అర్థం చేసుకొని దానికి సమాజంలో  ప్రచారం కావాలి అని  తలచి  దానికోసం ప్రణాళికలను రచించాడు  తనకు ఆనందుడు అన్న శిష్యుడు  దొరికాడు  తన మనసును అర్థం చేసుకొని  తాను ఏది సమాజానికి ఉపయోగపడే కృషి చేద్దామనుకుంటున్నాను  దానిని అర్థం చేసుకుని  నాతోనే కలిసి ఉంటూ  ప్రచారం చేయడానికి సిద్ధమైన వాడు బుద్ధుడు స్త్రీలకు స్థానం ఇవ్వలేదు  ఎందుకు ఏమిటి అన్న విషయం శిష్యులకు తెలియదు  ఆ విషయాలను ఆయన ఎప్పుడూ చెప్పలేదు కూడా.సుందరి అన్న స్త్రీ వీరి బోధనలకు ఆకర్షితురాలై  వారి ఆశ్రమానికి వచ్చి ఆనందుడు  ఉన్న స్థలానికి వెళ్లి  తాను కూడా మఠం లోకి రావొచ్చాయని తనని అభ్యర్థించినప్పుడు  ఆనందుడు అంగీకరించి  ఆమెను బుద్ధ భగవానులకు  పరిచయం చేయడం  వారు అంగీకరించకపోయినా  పురుషులు చేయగలిగినది స్త్రీలు మాత్రం ఎందుకు చేయలేరు అన్న గట్టి నమ్మకంతో  ఆమెకు  తన పర్ణశాలలో  స్థానం ఇచ్చాడు  ఆ తరువాత పరిస్థితుల ప్రభావం వల్ల  బుద్ధుడు ఏ సిద్ధాంతాన్ని అమలు చేయాలని  బుద్ధిజం  ప్రారంభమైందో దానికి చీలిక ఏర్పడింది హీనయానము  మహాయానము  అన్న పేర్లు  వచ్చాయి ఆ వివరాలను కూడా శివనాగిరెడ్డి గారి రచనల్లో మనం తెలుసుకుందాం  ఇవాళ ప్రభుత్వం వారు ఇచ్చిన  పద్మశ్రీ నుంచి భారతరత్న వరకు  ఉన్న వాటిని ప్రక్కన పెట్టి  ఇలాంటివి ఏవి మాతృమూర్తి కాలి గోటికి కూడా పనికిరావు  అని  తనకు తానుగా  తన తల్లి పుత్రుడను  అని తన పేరు ముందు  వ్రాయడం  వారి సంస్కారం  మాతృమూర్తి అన్నపూర్ణ గారు ఎంత ఆనందించి ఉంటుందో  ఆలోచించండి  ఆ పరిణతి ఉన్నది కనుకనే  రెడ్డిగారు రాసిన ప్రతి వాక్యం  శాశ్వతంగా నిలిచిపోయే స్థితికి వచ్చింది.
----------------------------------------------------
సమన్వయం . డా. నీలం స్వాతి 
కామెంట్‌లు