పూర్వము పల్లవ వంశీకుడైన కోపార్తివేంద్ర వర్మ తన యొక్క 14 సంవత్సరాల పాలనలో చాలా వ్యయము చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భ గృహమును నూతనముగా కట్టించారు తర్వాత త్రికోణ చక్రవర్తి వీర నరసింహం యాదవ రాయుడు కాలములో దేవస్థానములు చాలా కాలము నూతనంగా కట్టబడినవే ఈ విజయనగర వంశంములో ఆఖరి రాజు అయిన శ్రీ రంగరాయుడు 1664 క్రీస్తుశకం చంద్రగిరి లో పాలించాడు వీరికి నామకార్థంలో సామంత రాజుగా తంజావూరు మధుర చెన్నపట్నం శ్రీరంగపట్నం రాజులు ఉన్నారు. వీరు 1960 సంవత్సరంలో పులికట్ట వద్ద ప్రముఖులుగా ఉన్నాడు డచ్ వారు వలదు అని చెప్పిన వినక ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మద్రాస్ ని ఇచ్చారు వీరు భక్తిశ్రద్ధలతో దేవస్థానాన్ని పరిపాలించినట్లుగా చెబుతూ ఉంటారు.క్రీస్తు శకం 164 లో బీజపూర్ సుల్తానులు కర్ణాటకను దండెత్తుటకు రంగోలి ఖాన్ షహజీ అను ఇరువురు సేనానులను పంపగా వారు చంద్రగిరి గిరిజలను లోపరుచుకొనగా రంగరాయలు ఉత్తర కర్ణాటకలో కొంతకాలము దాగి తుదకు 1646వ సంవత్సరంలో బెగ్నోర్ కు పోయి సామంతరాజై బెడ్నోూర్ ప్రభువు వద్ద దాగాడు ఆ రాజుతో ప్రసిద్ధికెక్కిన విజయనగరపు వంశస్తుల పాలన అంతమవటమే కాకుండా హిందువు ల పరిపాలన పోయి మహమ్మదీయుల పాలన దేశంలో వచ్చింది అందువల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తధాదిగా మహమ్మదీయుల పాలనలో ఉండి క్రీస్తు శకం 1646 మొదటి బీజిపూర్ సుల్తాన్లు పాలించారు ఆ తర్వాత ఢిల్లీ బాదుషా ఔరంగజేబు దక్షిణ దేశం దండెత్తి లోపరుచుకొని తంజావూరు తిరుచునాపల్లి మైసూరు వగైరా రాజ్యముల పైన ఆర్కాడులో ఒక నౌకరి నుంచి పాలింప ఆజ్ఞాపించి ఢిల్లీకి వచ్చేశాడు.వీరికే ఆర్కాడు నవాబు గా పేరు 1732లో ఆర్కాడు నవాబుగా రాజ్యములకు వచ్చిన దోస్తు అలీ కాలములో కలతలు ప్రారంభమైనవి. వీరి కాలంలోనే మహారాష్ట్ర రాజైన రఘోజి భానులే కర్ణాటక రాజ్యం పై దండెత్తి దామలచెరువు యుద్ధంలో 1740 లో నవాబులను ఓడించి కొంత దేశము దోచుకొని 10 లక్షల రూపాయలు తీసుకొని రాజ్యం వదిలి వెళ్ళిపోయారు ఇలా పోతూర భోజిభాసులే శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష నగలు సమర్పించారు అన్నది వదంతి వారు సమర్పించిన నగలు ఇంకా భద్రంగా ఉంచబడి శ్రీవారికి సమర్పణమగుచున్నవి ఈ నవాబు వంశం లో గృహకలత లు కలిగి ఒకరిని ఒకరు చంపుకున్న తర్వాత సైదు మహమ్మద్ ఢిల్లీ ఖాన్ అను పసివాడు నవాబుగా నిర్మించబడి 100 వాసికోటలో పెరుగుతూ ఉన్నాడు.
మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి