న్యాయాలు 534
తదంతాపకీర్ష న్యాయము
*****
తద్ అనగా అది, వాడు, ఆమె, అదియే. తదంతము అనగా ఆది అంతమందు కలది.తదంత పకీర్షము అనగా ఆది అంతము అంతటినీ కదిలించునది,ఆకర్షించునది అని అర్థము.తదంత సముదాయమును ఆకర్షించినట్లు అని అర్థము.
విడదీయ వీలు లేని ఒక వస్తు సముదాయము ఉన్నట్లయితే దానిలో ఏ ఒక్కటి కదిలించినా మిగతా అన్ని కూడా కదులుతాయి మొదలు కదిలిస్తే చివర కదులుతుంది,చివర కదిలిస్తే మొదలు కదులుతుంది.దీనికి ఉదాహరణగా రైలును తీసుకోవచ్చు. రైలు పెట్టెలలో ఏ కొన తీసుకున్నా లేదా,నడిమి భాగము కదిలించినా సముదాయము అంతా కూడా కదులుతుంది అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అయితే పురాణాలు, ఉపనిషత్తులు చదివిన వారు ఏమంటారంటే..అనుయాజ,ప్రయాజాదులు అనేవి కొన్ని హోమ విశేషములు ఉన్నాయి. అవి అనుయాజ దేవతలకు, ప్రయాజ దేవతలకు సంబంధించిన హోమాలు.వాటిల్లో అనుయాజాదులు,ప్రయాజాదులు తుది/ చివరివి మొదలువని ఈ సముదాయములో ఏ ఒకటి గ్రహించినా మిగతా అన్ని కూడా క్రమంగా వస్తాయని అంటారు.వాటికి విడదీయలేని సంబంధం ఉందని అంటారు .
అనుయాజ యాగమునకు ముగ్గురు దేవతలు ఉంటారనీ, ప్రయాజకు పంచదేవతల ఉంటారనీ, ప్రధాన యాగానికి పూర్వం చెయ్యాల్సింది ప్రయాజ యాగం అని చెబుతుంటారు.ఇవన్నీ ఆధ్యాత్మిక వాదుల దృష్టితో చూసేవి.
దీనినే"తీగ లాగితే డొంకంతా కదులుతుంది" అనే సామెతతో పోలుస్తూ కొంచెం మార్చు కోవాలి. తీగను పై నుంచి లాగినా కింద నుంచి లాగినా అంతా కదులుతుందనేది మనకు తెలిసిందే.
మరి ఈ న్యాయమును మనుషులకు ఎందుకు వర్తింపజేసి చెప్పాలో చూద్దాం.
మనిషి ఎప్పుడూ ఒంటరి జీవి కాదు. అతని జీవితంతో అటు తల్లి,ఇటు తండ్రితో మొదలై తరాలతో విడదీయలేని బంధంతో ముడిపడి వుంటుంది.మనిషి లక్షణాలు,రూపు రేఖలను గురించి చెప్పుకోవాలంటే అటేడు ఇటేడు తరాలను తరచి చూడాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు.
ఇలా వివరంగా చూద్దాం. అణువు అనేది రెండు లేక అంతకంటే ఎక్కువ పరమాణువుల సమూహం. దానిని ఎలా పరిశీలించినా వాటి తుది , మొదలు మధ్య బంధాన్ని కలిగి ఉంటుంది కదా! అలాగే వ్యక్తుల జీవితాలు కూడా. ఈ "తదంతా పకీర్ష న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
"అనుబంధం ఆత్మీయత అంతా ఓ బూటకం" అని ఓ కవిగారు ఎంత నిరాశగా రాసినా ..."ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమూ,ఎంత వరకీ బంధము అని తాత్వికతతో పాడుకున్నా "కావడి కొయ్యేనోయ్, కుండలు మన్నేనోయ్" అన్న సత్యాన్ని మరవలేం కదా!
మనల్ని విడదీయరాని, విడదీయలేనివి బంధాలు బతుకంతా ఉంటాయనేది తెలిసి మసలుకోవడమే జీవితం.అంతే కదండీ!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి