పచ్చని వృక్షం రక్షణ కవచం;- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-ఆస్టిన్,అమెరికా
 ప్రాణం పోసే వాయువు
ఆయుస్సు పెంచే వాయువు
ప్రాణులకు రక్షణ కవచం!!
ఆరోగ్యం ఆహారం
ఆహార్యం ఆనందం
ఇచ్చే పచ్చని సిరులు
ప్రాణుల పాలిట వరాలు!!
స్వార్థానికి బానిసై
అర్థంతో దోస్తీ చేస్తూ
ఆనందానికి పెట్టుబడి పెట్టి
అభివృద్ధిని కట్ట బెట్టి
ప్రాణమిచ్చే వాయుదేవతను
బలిచేస్తూ
చేజేతులా చెట్లను నరికేస్తూ
వాటి ప్రాణం తీసేసి
కాలుష్య కోరలలో  చిక్కి
విషవాయువుల వలయంలో  నక్కి
తన ప్రాణాన్ని తానే తీసేసుకుంటూ
పయనం సాగిస్తున్న మనిషి
నేటి కాలపు వ్యవస్థ
అన్నింటా అవస్థలు
దిగజారుతున్న పర్యావరణం
ఎగబాకుతున్న కాలుష్యం
ఉన్నత పథంలో తానే అగ్రగామిగా నిలుస్తూ
చెట్ల వలువలు ఊడడేసి 
చెమట విలువకు గాలమేసి
యంత్రాల గాలిని పీలుస్తూ
సహజగాలికి దూరమౌతూ
ఎప్పుడు తెలుసుకొనునో
చెట్ల ఆవశ్యకత
పెంచి రక్షించాలన్న అవసరం
ప్రాణ వాయువు నిచ్చే తల్లికి బాసటగా ఉండాలన్న తాపత్రయమే 
పోషించాలన్నది
అది నీ విద్యుక్తధర్మమే
వృక్షో రక్షతి రక్షతః
-------------

కామెంట్‌లు