ఆస్వాదన;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 చర్మం ఎంత సాగినా మౌనమే 
కర్రతో ప్రతిసంగమం శబ్దమే 
గింజగా ఒంటరినై తపించినా, జపించినా 
ధూళినై గాలిలో కలిసిపోయా 
కాని, నీటి బొట్టుతో స్నేహంచేశాకనే
జనాలకు జీవంపోసే
వనాలకు ప్రాణప్రతిష్ట చేశా! 
ఒంటరిగా ఎంతో కాలం తిరిగా 
అజ్ఞానిగానే మిగిలిపోయా 
గురువుతో ఉపవసించాకనే జ్ఞానినయ్యా 
ఒంటిగా ఎంతసేపున్నా అది ఏకాంతమే 
కాంతతో ఆనుగమించాకే 
మానవజాతినే ఉధ్ధరించా 
ఊయల ఎంతసేపు ఊగినా ఏం లాభం? 
ఊగే ఊయల ఆగితేనే కదా 
దాన్ని అధివసించి ఆనందించేది 
సంతోషపు అలలపై మనసూగేది
ఊయలతో మన సంగమమే కదా 
మనం స్వర్గ సుగంధాలను ఆస్వాదించి 
ప్రాణవంతం చేసేది !!
**************************************
.

కామెంట్‌లు