సన్మానం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 సాటిలేని మేటికవిత
మరి రాయాలని ఉంది కాని
జనాలు మెచ్చుతారో లేదోనని
వలముగ కైతలురాసి
రణగొణధ్వనులు జేయక నా
గతమును మరిచిపోయి
మగటిమి చూపగా వలెనని నిశ్చయించి
నగధరుని సారెసారెకు మ్రొక్కి
మదినెంచకు నా తప్పులని
జగముమెచ్చునట్లు నేను కవితలు రచించు
వరము దయచేయుమని ప్రార్థించి
రజమును సవరించుకొని ఆలముసేయక
గనముగ కైతలు రచియించి
మధురకవి యన్న బిరుదు పొంది
నగరములో సన్మానం పొందాను!!

{వలముగ=విస్తారముగ;రజము=దోషము;
ఆలము=అశ్రధ్ధ;గనముగ=ఆశ్చర్యకరముగ}
*************************************

కామెంట్‌లు