సుప్రభాత కవిత ; -బృంద
అరాచకాలకు అసహాయంగా లొంగి
అవమానాలకు అచేతనంగా కుంగి
అలవాటుగా దాష్టీకాన్ని సహించి
ఆలోచనే రాక మోడైన బ్రతుకులో....

శిలగా మారిన తలపులు
కలగా మారిన కోరికలు
విలవిల లాడిన మనసులు
కళలే నోచని క్రమంలో....

మోడుకు జీవం  వచ్చినట్టు
బీడుకు సారం పోసినట్టు
నీడగ నీ వెంటే వుంటానంటూ
తోడుగ నిన్ను  గెలిపిస్తానంటూ...

పుడమిని చీల్చుకు పుట్టి
పచ్చని పువ్వులు రేకులు విప్పి
పండుగ రోజులు వచ్చెనంటూ
పసుపు కళలు విరజిమ్మినట్టూ..

ఎదురుచూసిన క్షణాలను
కుదురుగ  నిలిపేటందుకు
ఎదురేలేని విజయాన్నిచ్చి
మధురంగా మార్చిన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు