తథ్యము;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మదమెక్కిన పశువు వాడు
మగువ మనసు తెలుసుకొనడు
మగటిమి అనుకొని వాడు
మగనాలిని అణచెటోడు
మదిరాపానము చేసిన మగగురి గల
మత్తేభము వలె చెలగువాడు
మర్యాదను మంటగలిపి
మర్షణమును వీడినాడు
మయికముతో మయిదు కమ్మి
మరకటము వలె చేష్టలతో
మర్కుని రాతను తనకుతానె మార్చుకొని
మరిమ బలికి ఆహుతగును
మన్ననతో మనుగడ సాగించుమనిన
మదిని మథనముచేసి మంచిమనిషిగా మారిపోయి
మనువునకు అర్థము తెలిసికొని జీవించిన
మధురమగును సంసారము తథ్యమిది!!

{మర్షణము=ఓర్పు;మయికము=మత్తు;
మయిదు=మాయ;మరకటము=కోతి;
మర్కుడు=బ్రహ్మ;మరిమ=మృత్యువు;మన్నన=గౌరవము}
**************************************

కామెంట్‌లు